Begin typing your search above and press return to search.

ఆహా 'అన్‌ స్టాపబుల్‌ 2' అప్డేట్‌ వచ్చింది

By:  Tupaki Desk   |   17 Sep 2022 7:59 AM GMT
ఆహా అన్‌ స్టాపబుల్‌ 2 అప్డేట్‌ వచ్చింది
X
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న బాలయ్య అన్‌ స్టాపబుల్‌ సీజన్‌ 2 కి సంబంధించిన మరో అప్‌డేట్‌ ని ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే సీజన్ 2 కి సంబంధించిన అధికారిక ప్రకటన చేసిన ఆహా వారు తాజాగా కమింగ్ సూన్ అంటూ ఈ పోస్టర్ ని విడుదల చేయడం తో నందమూరి అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూసేలా చూశారు.

బాలయ్య లోని ఒక కోణం ను మాత్రమే ఇన్నాళ్లు చూస్తూ వచ్చిన ప్రేక్షకులకు మరియు ఆయన అభిమానులకు అన్‌ స్టాపబుల్‌ టాక్ షో ఆయనలోని మరో యాంగిల్ ను చూపించడం జరిగింది.

అందుకే ఒక్క సీజన్ గా అనుకున్న అన్‌ స్టాపబుల్‌ ని సీజన్ లు సీజన్ లు గా నిర్వహించాలని ఆహా వారు భావిస్తున్నారు.. అలాగే బాలయ్య కూడా వరుస సీజన్ లు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు లోనే బాలయ్య అన్‌ స్టాపబుల్ సీజన్ 2 ని స్ట్రీమింగ్‌ చేయాల్సి ఉంది. కానీ బాలయ్య ముందస్తుగా కమిట్ అయిన గోపీచంద్‌ మలినేని సినిమా షూటింగ్‌ ఆలస్యం అయ్యింది. దాంతో అన్ స్టాపబుల్‌ కి ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఆ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకోవడంతో ఈ టాక్ షో కి టైమ్ ని బాలయ్య కేటాయించాడు అనేది సమాచారం.

మొదటి ఎపిసోడ్‌ ఎలా ఉండబోతుంది.. అసలు మొదటి ఎపిసోడ్‌ గెస్ట్‌ ఎవరా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్ మొదటి వారం గెస్ట్‌ మోహన్ బాబు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సీజన్‌ కి మెగాస్టార్‌ చిరంజీవిని తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

ఎలాగూ మెగాస్టార్ చిరంజీవి యొక్క గాడ్‌ ఫాదర్‌ సినిమా అక్టోబర్ 5వ తారీకు దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిరంజీవి అన్‌ స్టాపబుల్‌ సీజన్ 2 మొదటి గెస్ట్‌ గా వస్తే సూపర్బ్‌ గా ఉంటుందని మెగా మరియు నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.