Begin typing your search above and press return to search.

2023 రాబోతున్న భారీ సినిమాలు.. ఒకదానికిమించి మరొకటి లెక్కకు మించి రెడీ..!

By:  Tupaki Desk   |   19 Oct 2022 11:30 PM GMT
2023 రాబోతున్న భారీ సినిమాలు.. ఒకదానికిమించి మరొకటి లెక్కకు మించి రెడీ..!
X
2020 నుంచి కోవిడ్ ఎటాక్ అవడంతో 2020-21 బాక్సాఫీస్ వెల వెలబోయిందని చెప్పొచ్చు. 2020లో చివర్లో ఒకటి రెండు సినిమాలు.. 2021 లో కొన్ని సినిమాలు ఉత్సాహాన్ని తెచ్చాయి.. 2021 మిడిల్ లో మళ్లీ సెకండ్ వేవ్ వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రాని పరిస్థితి ఏర్పడింది. ఆ టైం లో పూర్తి చేసిన సినిమాలను ఏం చేయాలో దర్శక నిర్మాతలకు అర్ధం కాలేదు. ఫైనల్ గా 2022 మొదటి నుంచి సినిమా పరిశ్రమ ఊపిరి పీల్చుకునేలా ఉంది. స్టార్ సినిమాలే కాదు కంటెంట్ ఉన్న సినిమాలు కూడా ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టాయి.

ఇక 2022 మరో రెండు నెలల్లో ముగుస్తుంది. రెండు మూడు పెద్ద సినిమాలు తప్ప ఈ ఏడాది సినిమాల రేసు ముగిసినట్టే. ఇక ఇప్పుడు అందరు 2023 ని టార్గెట్ చేస్తున్నారు. 2023 సంక్రాంతి నుంచే సినిమాల మధ్య భారీ క్లాష్ రానుంది. పొంగల్ రేసులో మేమంటే మేము అంటూ స్టార్స్ పోటీ పడుతున్నారు. ఈ లిస్ట్ లో నేషనల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ ముందు వరుసలో ఉంది. ఓం రౌత్ డైరక్షన్ లో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న రామాయణ నేపథ్యంతో వస్తున్న ఈ మూవీపై నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ ఏర్పడింది. ఈమధ్య వచ్చిన టీజర్ కూడా ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపుచేసింది.

ఇదే వరుసలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ గెటప్ తో అలరించనున్నారు. కెరియర్ లో ఫస్ట్ టైం కొత్త పాత్రలో కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. 17వ శతాంధం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. క్రిష్ మార్క్ మూవీగా హరి హర వీరమల్లు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. 2023 సంక్రాంతి రేసులో దళపతి విజయ్ వాసుడు కూడా ఉంటుందని టాక్. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న నటిస్తుంది. మహర్షి హిట్ తో సూపర్ ఫాం లో ఉన్న వంశీ విజయ్ తో వారసుడు అంటూ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రాబోతున్నారు. ఈ మూవీపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

సంక్రాంతి రేసులో తాను కూడా ఉంటానని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో ఈ వాళ్తేర్ వీరయ్యగా చిరు వస్తున్నారు. గాడ్ ఫాదర్ హిట్ జోష్ తో జోష్ మీద ఉన్న చిరు వాళ్తేర్ వీరయ్యతో మరోసారి మెగా మేనియా చూపించాలని ఫిక్స్ అయ్యారు. సంక్రాంతి సందడి తర్వాత నాని దసరా.. రవితేజ ధమాకా సినిమాలు సమ్మర్ కి ముందే వచ్చి హడావిడి చేయనున్నాయి.

ఇక 2023 సమ్మర్ కి మరోసారి స్టార్స్ మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరగనుందని తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబోలో వస్తున్న సినిమాని ఏప్రిల్ 28న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ ప్రకటించి షాక్ ఇచ్చారు మేకర్స్. అనుకున్నట్టుగానే నెక్స్ట్ సమ్మర్ కి ఆ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సలార్ మూవీ కూడా సమ్మర్ రేసులో నిలుస్తుంది. రాం చరణ్ శంకర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఆర్సీ 15వ సినిమా కూడా 2023 సమ్మర్ కే రిలీజ్ అనుకుంటున్నారు. వీటితో పాటుగా కమల్ హాసన్ ఇండియన్ 2 కూడా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రానుంది. ఎన్.టి.ఆర్30వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో వస్తుండగా ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. తారక్ 30వ సినిమా కూడా 2023 సెకండ్ హాఫ్ ఆగష్టులో అలా రిలీజ్ అనుకుంటున్నారు.

ఇక ఇవే కాకుండా బాలీవుడ్ లో కూడా 2023 సినిమాల సందడి బాగానే ఉండేలా ఉంది. షారుఖ్ ఖాన్ పఠాన్ జనవరిలోనే రిలీజ్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ టైగర్ 2, కూడా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అట్లీ డైరక్షన్ లో షారుఖ్ ఖాన్ చేస్తున్న జవాన్ సినిమా కూడా 2023 సమ్మర్ రిలీజ్ అనుకుంటున్నారు. బ్రహ్మాస్త్ర 2 సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి 2023 సినీ ప్రియులకు సూపర్ హంగామా షురూ అవుతుందని చెప్పొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.