Begin typing your search above and press return to search.

ప్రేమమ్‌.. మజిలీ మిక్స్‌ చేసి 'థ్యాంక్యూ'

By:  Tupaki Desk   |   15 Jun 2022 8:30 AM GMT
ప్రేమమ్‌.. మజిలీ మిక్స్‌ చేసి థ్యాంక్యూ
X
నాగ చైతన్య హీరోగా విక్రమ్‌ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన థాంక్యూ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా నుండి ఒక్కో పోస్టర్ వస్తున్నా కొద్ది సినిమా గురించి తెర లేచినట్లుగా క్లారిటీ వస్తుంది. హీరోయిన్స్ ముగ్గురు ఈ సినిమాలో నటిస్తున్నారంటే ఎందుకో అనుకున్నాం. కాని నాగ చైతన్య మూడు జనరేషన్‌ ల వయసు లో కనిపించబోతున్నాడట.

గతంలో ప్రేమమ్‌ సినిమా లో ఎలా అయితే కనిపించాడో అలా నాగ చైతన్య ఈ సినిమా లో కూడా కుర్రాడిగా.. కాస్త వయసు ఉన్న వ్యక్తిగా ఇలా మూడు విభిన్నమైన వేరియేషన్స్ లో కనిపించబోతున్నాడు.

మజిలీ సినిమా లో కూడా నాగ చైతన్య రెండు వేరియేషన్స్ లో కనిపించిన విషయం తెల్సిందే. హీరో గా ఇలాంటి ప్రయోగాలు ఒక సారి చేయడం చాలా పెద్ద విషయం.

నాగ చైతన్య మాత్రం ఇలా వయసు తేడా తో పాత్రలో వేరియేషన్స్ తో మూడవ సారి కనిపించబోతున్నాడు. మజిలీ సినిమా లో రెండు ప్రేమ కథలు ఎలా అయితే చూపించాడో అలాగే ఈ థాంక్యూ సినిమాలో కూడా ఖచ్చితంగా విభిన్నమైన మూడు ప్రేమ కథలు ఉండే అవకాశం ఉంది అంటూ పోస్టర్స్ చూస్తుంటే అనిపిస్తుంది.

నూనూగు మీసాల కుర్రాడిగా.. టీనేజర్ గా చైతూ మళ్లీ ఈ సినిమా లో కనిపించబోతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లో నాగ చైతన్య టీనేజర్ లుక్ లో భలే ఉన్నాడే అన్నట్లుగా టాక్‌ ను దక్కించుకున్నాడు. హీరోగా నాగ చైతన్య మరియు దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

చైతూ గత చిత్రాలు పాజిటివ్‌ రెస్పాన్స్ ను దక్కించుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ సినిమా విషయంలో అభిమానులు చాలా ఆశగా ఉన్నారు. కనుక దర్శకుడు విక్రమ్‌ చాలా జాగ్రత్తలతో ఈ సినిమాను విడుదల చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో మనం వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా వారికి మరో విజయాన్ని ఇవ్వబోతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.