Begin typing your search above and press return to search.

SSMB28 : పూజా తప్పితే మరో హీరోయిన్‌ లేదా!

By:  Tupaki Desk   |   26 Aug 2022 4:30 PM GMT
SSMB28 : పూజా తప్పితే మరో హీరోయిన్‌ లేదా!
X
సూపర్ స్టార్‌ మహేష్ బాబు.. త్రివిక్రమ్‌ కాంబో సినిమా షూటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. షూటింగ్స్ బంద్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ను సెప్టెంబర్‌ మొదటి వారం పట్టాలెక్కించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. దర్శకుడు త్రివిక్రమ్‌ ఈమెను ఎప్పుడో ఎంపిక చేశాడు.

సినిమా అధికారికంగా ప్రకటన రాకముందే పూజా హెగ్డే ను కన్ఫర్మ్‌ చేశాడు. అయితే మహేష్‌ బాబు అభిమానులతో పాటు సాదారణ సినీ ప్రేమికులు మరియు ప్రేక్షకులు మాత్రం పూజా హెగ్డే ను ఈ సినిమా లో నటింపజేయడం ను వ్యతిరేకిస్తున్నారు. పూజా హెగ్డే ను ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం.. ఆమె మరీ బోర్‌ కొట్టేసింది. ఇకపైన అయినా కొత్త హీరోయిన్ ను తీసుకు రావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

పూజా హెగ్డే రాధేశ్యామ్‌ సినిమా తో పాటు మరి కొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచిన విషయం తెల్సిందే. ఫ్లాప్ హీరోయిన్ ను మళ్లీ మహేష్ బాబు తో నటింపజేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పూజా హెగ్డే తెలుగు లో ఫేడ్‌ ఔట్‌ అవుతున్న హీరోయిన్‌ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే మహేష్ బాబు సినిమా కు పూజా హెగ్డే ను త్రివిక్రమ్‌ కన్ఫర్మ్‌ చేశాడు. ఆ విషయంలో ఆయన నిర్ణయం మార్చుకునే అవకాశం లేదు. అయినా కూడా అభిమానులు మాత్రం తమ ఫ్రస్టేషన్ ను పూజా హెగ్డే ఎంపిక విషయంలో వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మహేష్ బాబు తో పూజా హెగ్డే మొదటి సారి అయినా కూడా ఒకింత అసంతృప్తిని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

మరి త్రివిక్రమ్‌ సెలక్షన్ మరియు నిర్ణయం ఎంత వరకు కరెక్ట్ అనేది సినిమా విడుదల అయితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా హిట్ అయితే పూజా హెగ్డే తెలుగు లో మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.