Begin typing your search above and press return to search.

శ‌ర్వానంద్ - కృష్ణ‌చైత‌న్య‌ల జ‌ర్నీ షురూ!

By:  Tupaki Desk   |   5 Sep 2022 8:56 AM GMT
శ‌ర్వానంద్ - కృష్ణ‌చైత‌న్య‌ల జ‌ర్నీ షురూ!
X
విభిన్న‌మైన సినిమాల‌తో హీరోగా ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు ప్రామిసింగ్ హీరో శ‌ర్వానంద్‌. గ‌త కొంత కాలంగా బిగ్ బ్యాంగ్ లాంటి మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల త‌ను న‌టించిన సినిమాల‌న్నీ బ్యాక్ టు బ్యాక్ నిరాశ‌కు గురిచేయ‌డంతో గ‌త ఎనిమిది నెల‌లుగా మ‌రో కొత్త సినిమా ప్ర‌క‌టించ‌లేదు. 'ఆడాళ్లు మీకు జోహార్లు' మూవీ త‌రువాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో బైలింగ్వ‌ల్ మూవీగా శ‌ర్వా న‌టించిన 'ఒకే ఒక జీవితం' సెప్టెంబ‌ర్ 9న భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది.

ఈ నేప‌థ్యంలో సోమ‌వారం సెప్టెంబ‌ర్ 5న యంగ్ అండ్ టాలెంటెడ్ రైట‌ర్‌, అండ్ డైరెక్ట‌ర్ కృష్ణ చైత‌న్య‌తో త‌న కొత్త ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై ఈ మూవీని ప్రామిసింగ్ ప్రొడ్యూస‌ర్ టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సంస్థ స‌హ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించిన 'కార్తికేయ 2' ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోనూ  బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేస్తోంది.

అలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందించిన  నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ హీరో శ‌ర్వానంద్, ద‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య‌తో తాజా చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఇందులో శ‌ర్వాకు జోడీగా రాశీ ఖ‌న్నా న‌టిస్తోంది.

సోమ‌వారం లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం హీరో, హీరోయిన్ ల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి స్టార్ డైరెక్ట‌ర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ క్లాప్ నిచ్చారు. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

రీసెంట్ గా 'సీతారామం', 'కార్తికేయ 2' సినిమాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకున్న హ‌ను రాఘ‌వ‌పూడి, చందూ మొండేటితో పాటు ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ‌, యువీ క్రియేష‌న్స్ వంవీ, విక్ర‌మ్‌, చిత్ర బృందం ద‌ర్శ‌కుడు కృష్ణ‌చైత‌న్య‌కు స్క్రిప్ట్ అంద‌జేశారు. హీరో శ‌ర్వానంద్ న‌టిస్తున్న 33వ సినిమా ఇది. వివేక్ కూచిభోట్ల స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ మూవీని పొలిటిక్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని అక్టోబ‌ర్ నుంచి ప్రారంభించ‌బోతున్నారు.  

టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కృష్ణ చైత‌న్య అందించిన ప‌వ‌ర్ ఫుల్ స్క్రిప్ట్ లో శ‌ర్వానంద్ ఇంటెన్స్ క్యారెక్ట‌ర్ లో క‌నిపించ‌బోతున్నాడు. రాశీఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలోకి కీల‌క పాత్ర‌లో ప్రియ‌మ‌ణి క‌నిపించ‌నున్నారు. కీల‌క న‌టీన‌టులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించనున్నారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తుండ‌గా, జ‌మ్షీ ఖ‌లీద్ సినిమాటోగ్ర‌ఫీ, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ జ‌య‌శ్రీ , ఆర్ట్ డైరెక్ట‌ర్ విట్ట‌ల్‌, ఫైట్స్ 'సుప్రీమ్‌' సుంద‌ర్. ఇత‌ర వివ‌రాల‌ని త్వ‌ర‌లో చిత్ర బృందం వెల్ల‌డించ‌నుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.