Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌: 'నాన్న' అంటూ ఎవ‌రినుద్ధేశించి బాబూ?

By:  Tupaki Desk   |   14 Nov 2022 4:16 AM GMT
#గుస‌గుస‌: నాన్న అంటూ ఎవ‌రినుద్ధేశించి బాబూ?
X
టాలీవుడ్ లో ద‌శాబ్ధాల పాటు క‌థానాయ‌కుడిగా ఏల్తున్న ఒక సీనియ‌ర్ హీరోకి ఊహించ‌ని విధంగా అవ‌మానం ఎదుర‌యింది. అత‌డు చాలా లేట్ ఏజ్ లో హీరో అయ్యాడ‌ని అయినా అందాల యువ‌ క‌థానాయిక‌ల‌తో వ‌రుసగా ప్రేమ‌క‌థ‌ల్లో న‌టిస్తున్నాడ‌ని ఇదివ‌ర‌కూ మీడియా క‌థ‌నాలు వేడెక్కించేవి. ఇటీవ‌లి కాలంలో త‌న సినిమాల్లో ఇద్ద‌రు క‌థానాయిక‌లు ఉండాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు కూడా గుస‌గుస‌లు వినిపించాయి.

నిండా పాతిక వ‌య‌సు అయినా దాట‌ని టీనేజీ క‌థానాయిక‌ల‌తో 50ప్ల‌స్ ఏజ్ మాస్ హీరో రొమాన్స్ ఏంటో అంటూ ఒక సెక్ష‌న్ ఎప్పుడూ కామెంట్లు చేస్తూనే ఉంటుంది.

ఇప్పుడు క్రేజీగా స‌ద‌రు మాస్ హీరో ఒక ఫ్యామిలీ డ్రామా కం ల‌వ్ స్టోరిలో న‌టిస్తుండ‌డం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఈ సినిమాలో త‌న వ‌య‌సులో స‌గం కంటే ఇంకా త‌క్కువ ఉండే (సుమారు 21 వ‌య‌సు) హీరోయిన్ తో స‌ద‌రు హీరో రొమాన్స్ చేస్తుండ‌డం గుస‌గుస‌గా మారింది. అంతేకాదు.. యాధృచ్ఛిక‌మో ఏమో కానీ అత‌గాడిని ఉద్ధేశించి లిరిసిస్ట్ తెలివిగా ఓ లిరిక్ లో 'నాన్న' అనే ప‌దాన్ని ఇరికించారు. అది గాయ‌ని స్వ‌రంలో అంతే ఒద్దిక‌గా ఒదిగిపోయి స‌ద‌రు లేట్ ఏజ్ హీరో వ‌య‌సుని ఎత్తి చూపిస్తున్న‌ట్టుగా ఎలివేట్ అయ్యింది.

బ‌హుశా ఆ లిరిసిస్ట్ కావాల‌ని అలా రాసి ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ ఈ ప్రోమో చూశాక స‌ద‌రు లేట్ ఏజ్ హీరోనుద్దేశించే ఇలా తెలివిగా నాన్న ప‌దాన్ని ఇరికించి రాసార‌ని కూడా కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

ప్ర‌స్తుతానికి ఈ కామెడీ ప్రోమోని యూత్ సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ చేస్తున్నారు. ''వ్వాట్ హ్యాపెనింగ్?'' అనేది తెలుసుకునే లోపే స‌ద‌రు హీరోకి జ‌రగాల్సిన డ్యామేజ్ అయితే జ‌రిగిపోయింద‌ని ఇప్పుడు అంతా గుస‌గుస‌లాడుకుంటున్నారు.

ప్చ్.. లేట్ ఏజ్ లో త‌న వ‌య‌సుకు తగ్గ క‌థ‌ల్ని ఎంచుకుని డిగ్నిఫైడ్ గా ఉండే సినిమాలు చేస్తే ఫ‌ర్వాలేదు కానీ.. మ‌రీ ఇలా టీనేజీ హీరోయిన్ల‌తో రొమాన్స్ ల‌వ్ అంటూ చెట్టు పుట్ట వెంట తిరిగితే అది ఎంతో ఎబ్బెట్టుగా ఉంటుంద‌ని చెప్పేందుకే స‌ద‌రు లిరిసిస్టు ఈ 'నాన్న‌' అనే ప‌దాన్ని తెలివిగా ఇరికించాడ‌ని కూడా గుస‌గుస‌లాడేస్తున్నారు. హ‌తఃవిధీ...!!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.