Begin typing your search above and press return to search.

బంద్‌ తర్వాత 'సలార్‌' షూట్ అప్‌డేట్‌

By:  Tupaki Desk   |   31 Aug 2022 12:32 PM GMT
బంద్‌ తర్వాత సలార్‌ షూట్ అప్‌డేట్‌
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా.. కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌ సినిమా షూటింగ్ టాలీవుడ్‌ నిర్మాతల బంద్‌ కారణంగా నిలిచి పోయిందట. మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను జరిపిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ బంద్ తర్వాత కొత్త షెడ్యూల్‌ ను ప్లాన్ చేశాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయట.

సెప్టెంబర్‌ 2వ తారీకు నుండి సలార్‌ కొత్త షెడ్యూల్‌ నిర్వహించబోతున్నారు. హైదరాబాద్‌ లో ప్రత్యేకంగా వేసిన సెట్‌ లో సలార్‌ షూటింగ్ ను నిర్వహించబోతన్నట్లుగా ప్రశాంత్‌ నీల్‌ పేర్కొన్నాడు. దాదాపుగా మూడు వారాల నుండి నాలుగు వారాల వరకు కంటిన్యూస్‌ గా ఈ సినిమా తాజా షెడ్యూల్‌ షూటింగ్‌ ను నిర్వహించేందుకు ప్రశాంత్‌ నీల్ సిద్ధం అయ్యాడట.

ఈ షెడ్యూల్‌ లో ప్రభాస్ పై అత్యంత కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్రభాస్ మరియు శృతి హాసన్‌ ల కాంబోలో లవ్ కమ్ రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ జరుగబోతుందట. ప్రస్తుతం బాలయ్య సినిమా షూట్ లో పాల్గొంటున్న శృతి హాసన్‌ ఆ షూటింగ్ పూర్తి చేసుకుని వెంటనే సలార్‌ షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతుందట.

ప్రభాస్ రాధేశ్యామ్‌ నిరాశ పర్చడంతో ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకుని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ తో ఏకంగా వెయ్యి కోట్లు వసూళ్లు సాధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో మరో వెయ్యి కోట్ల సినిమా ప్రభాస్ ఖాతాలో పడటం ఖాయం అని అభిమానులు ధీమాతో ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్స్ తో పాటు మలయాళ స్టార్‌ నటుడు కనిపించబోతున్నాడు.

సలార్ తో పాటు ప్రభాస్ వరుసగా ఆదిపురుష్ మరియు ప్రాజెక్ట్‌ కే సినిమాల్లో కూడా చేస్తున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్‌ షూటింగ్‌ పూర్తి అయ్యి వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ జరుపుకుంటూ ఉంటే ప్రాజెక్ట్‌ కే షూటింగ్‌ దశలో ఉంది.

ఇక మారుతి దర్శకత్వంలో ఒక సినిమా మరియు సందీప్ వంగ దర్శకత్వంలో మరో సినిమాను ప్రభాస్‌ చేసేందుకు కమిట్‌ అయిన విషయం తెల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.