Begin typing your search above and press return to search.

RC15 నుంచి స‌ర్‌ ప్రైజ్ రాబోతోందా?

By:  Tupaki Desk   |   22 Aug 2022 5:12 AM GMT
RC15 నుంచి స‌ర్‌ ప్రైజ్ రాబోతోందా?
X
పాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి అత్యంత ప్ర‌తి ష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన 'RRR' ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో క‌లిసి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఈ మూవీ థియేట‌ర్ల‌లోనే కాకుండా ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ల‌లోనూ రికార్డులు సృష్టిస్తూ హ‌ట్ టాపిక్ గా నిలిచింది. ఈ మూవీతో ఒక్క‌సారిగా రామ్ చ‌ర‌ణ్ , ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ లు పాపులర్ అయ్యారు.

అంతే కాకుండా ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో వీక్షిస్తున్న హాలీవుడ్ స్టార్స్ రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ది గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ని చేస్తున్న విష‌యం తెలిసిందే. RC15 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ కీల‌క షెడ్యూల్స్ రాజ‌మండ్రి, అమృత్ స‌ర్, హైద‌రాబాద్ లో జ‌రిపిన షూటింగ్ లో కీల‌క ఘ‌ట్టాల షూటింగ్ పూర్త‌యింది.

చ‌ర‌ణ్ 15వ ప్రాజెక్ట్ గా అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్ప‌నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో 50వ ప్రాజెక్ట్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీని 90 వ శ‌కంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల‌కు నేటి కాలానికి లింక‌ప్ చేస్తూ ఈ మూవీని స‌మ‌కాలీన రాజ‌కీయాంశాల నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ కు బ్రేకిచ్చిన విష‌యం తెలిసిందే.

క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న 'ఇండియ‌న్ 2'ని తిరిగి ప్రారంబిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ RC15 కి సంబంధించిన అప్ డేట్ ఇవ్వ‌మంటూ ఫ్యాన్స్ గ‌త కొన్ని రోజులుగా నిర్మాత దిల్ రాజుని అడుగుతున్నారు. ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మెగా కార్నివాల్ లో పాల్గొన్న దిల్ రాజు RC15 కి సంబంధించిన అప్ డేట్ గురించి వెల్ల‌డించి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు.

త్వ‌ర‌లోనూ ఈ మూవీ నుంచి స‌ర్ ప్రైజ్ రాబోతోంద‌ని ప్ర‌క‌టించి అభిమానుల‌ని స‌ర్ ప్రైజ్ చేశారు. దీంతో గ‌త కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ నుంచి అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ ఇప్పుడు హ్యాపీగా ఫీల‌వుతున్నార‌ట‌.

అయితే దిల్ రాజు ఇస్తాన‌న్న అప్ డేట్ ఏంటీ అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. టైటిల్ ని రివీల్ చేయ‌బోతున్నారా? లేక చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేయ‌బోతున్నారా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నార‌ట‌.