Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ RC 15 విల‌న్ వ‌చ్చేశాడు!

By:  Tupaki Desk   |   9 Sep 2022 5:48 AM GMT
చ‌ర‌ణ్ RC 15 విల‌న్ వ‌చ్చేశాడు!
X
మెగా పవ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 'RRR'తో పాన్ ఇండియా స్టార్ గా మారిన విష‌యం తెలిసిందే. రాజ‌మౌళి తెర‌కెక్కించిన 'RRR' వ‌ర‌ల్డ్ వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో హీరోగా రామ్ చ‌ర‌ణ్ క్రేజ్ మ‌రింత‌గా పెరిగింది. దీంతో ఈ మూవీ త‌రువాత పెరిగిన రేంజ్ కి త‌గ్గుట్ట‌గా చ‌ర‌ణ్ ప్రాజెక్ట్ లు ప్లాన్ చేసుకుంటున్నాడు. 'RRR' బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత ది గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో చ‌ర‌ణ్ ఓ భారీ మూవీని చేస్తున్న విష‌యం తెలిసిందే.

స‌మ‌కాలీన రాజ‌కీయాంశాల నేప‌థ్యంలో పొలిటికల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీని శంక‌ర్ RC 15 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు త‌న సంస్థలో 50వ ప్రాజెక్ట్ గా అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ గ‌తంలోనే మొద‌లై కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో జ‌రిగిన ప‌లు రాజ‌కీయాంశాల‌కు నేటి వాతావ‌ర‌ణానికి లింక‌ప్ చేస్తూ ఈ మూవీని రూపొందిస్తున్నారు.

సినిమాలో చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. రెండు ర‌కాల గెట‌ప్ లు ఇప్ప‌టికే నెట్టింట లీకై సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. ఇదిలా వుంటే ఈ మూవీలోని ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ గా త‌మిళ ద‌ర్శ‌కుడు, న‌టుడు ఎస్‌.జె. సూర్య న‌టిస్తున్నారంటూ ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. అయితే చిత్ర బృందం నుంచి ఈ వార్త‌ల‌పై ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా శుక్ర‌వారం ఈ మూవీలో ఎస్‌.జె. సూర్య న‌టిస్తున్న విష‌యాన్ని చిత్ర బృందం వెల్ల‌డించింది.

హీరో రామ్ చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎస్‌.జె. సూర్య ఫొటోని షేర్ చేస్తూ 'వెర్స‌టైల్ యాక్ట‌ర్ మా స్టెల్ల‌ర్ కాస్ట్ లో జాయిన్ అయ్యారు. వెల్క‌మ్ ఆన్ బోర్డ్ సర్‌' అంటూ ఎస్‌.జె. సూర్య కు ఈ ప్రాజెక్ట్ లోకి స్వాగ‌తం చెబుతూనే ఆయ‌న మా సినిమాలో న‌టిస్తున్నార‌ని వెళ్ల‌డించారు. రామ్ చ‌ర‌ణ‌ఫ్ షేర్ చేసిన ఎస్‌.జె. సూర్య ఫొటో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

'ఇండియ‌న్ 2' రీ ఓపెన్ కార‌ణంగా RC 15 కు బ్రేక్ ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ మూవీ తాజా షెడ్యూల్ ని హైద‌రాబాద్ లో ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎస్‌.జె. సూర్య RC 15 సెట్ లోకి అడుగుపెడుతున్నార‌ట‌.

ఇప్ప‌టికే రాజ‌మండ్రి, అమృత్ స‌ర్‌, హైద‌రాబాద్ ల‌లో ఈ మూవీకి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఎస్‌.జె. సూర్య ఎంట్రీతో ఈ మూవీ షూటింగ్ మ‌రింత‌గా స్పీడందుకోనుంద‌ని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.