Begin typing your search above and press return to search.

బోయపాటితో మూవీ..రామ్ క్రేజీ అప్ డేట్..!

By:  Tupaki Desk   |   2 Jun 2023 12:24 PM GMT
బోయపాటితో మూవీ..రామ్ క్రేజీ అప్ డేట్..!
X
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ని థియేటర్ లో చూసి చాలా కాలామే అయ్యింది. ఆయన చివరగా వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ, ఆ సినిమా కొంచెం కూడా ఆసక్తికరంగా లేకపోవడంతో డిజాస్టర్ గా మారింది. మూవీలో ఒక్క పాట తప్ప, మరే ఆసక్తికర అంశం లేకపోవడం గమనార్హం. అందుకే ఈ సారి ఫుల్ పవర్ ప్యాక్డ్ మాస్ మూవీతో రావాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బోయపాటితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ఆయనకు రామ్ లాంటి ఎనర్జీ ఉన్న హీరో తోడు అయితే వారి కాంబినేషన్ చాలా క్రేజీగా ఉంటుంది. అందుకే ఈ మూవీ గురించి ఎప్పుడెప్పడు అప్ డేట్స్ బయటకు వస్తాయా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ని హీరో రామ్ చెప్పడం విశేషం.

రామ్ తన సోషల్ మీడియా ఎకౌంట్ లో మూవీ షెడ్యూల్ గురించి చెప్పారు. యాక్షన్ సీన్ కోసం దాదాపు 24 రోజులు కష్టపడ్డారట. ఫైనల్ గా అది పూర్తయ్యిందని ఆయన చెప్పారు. 24 రోజుల పాటు షెడ్యూల్ సాగింది అంటే, దాని కోసం రామ్ ఎంత కష్టపడ్డాడో, ఆ సీన్స్ ఎంత కష్టంగా ఉన్నాయో అర్థమౌతోంది.

కాగా, ఇది క్లైమాక్స్ కాదని, అంతకు మించి ఉంటుందని ఆయన చెప్పడం విశేషం. హైదరాబాదులోని ఓ ప్రయివేట్ స్టూడియోలో ఆ సీన్స్ తీసినట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్ ఇప్పుడు రామ్ ఫ్యాన్స్ కి కూడా ఎనర్జీ తెప్పించింది.

ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరో శ్రీకాంత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారట. కాగా, ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతెలా ఓ స్పెషల్ సాంగ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ మూవీకి సంబంధించి ఇటీవల రామ్ పుట్టిన రోజు మే15వ తేదీన మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. అందులో రామ్ చెప్పిన డైలాగులు కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆయన లుక్ చాలా డిఫరెంట్ గా కనపడుతోంది. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.