Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి - మ‌హేష్ ల ప్రాజెక్ట్ కు ముహూర్తం పెట్టేశారా?

By:  Tupaki Desk   |   12 Sep 2022 8:42 AM GMT
రాజ‌మౌళి - మ‌హేష్ ల ప్రాజెక్ట్ కు ముహూర్తం పెట్టేశారా?
X
స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ - సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌లిసి దాదాపు 12 ఏళ్ల విరామం త‌రువాత ఓ భారీ ప్రాజెక్ట్ ని చేస్తున్న విష‌యం తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్ప‌డెప్పుడు మొద‌ల‌వుతుందా? అని ఆస‌క్తిగా ఎదురుచూసిన అభిమానుల‌కు సోమ‌వారం త్ర‌విక్ర‌మ్‌, మ‌హేష్ గుడ్ న్యూస్ చెప్పారు. SSMB28 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ సోమ‌వారం రామోజీ ఫిల్మ్ సిటీలో మొద‌లైంది.

దీంతో గ‌త రెండు నెల‌లుగా ఈ మూవీ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ స‌ర్ పైజ్ ఫీల‌వుతున్నారు. ఎట్ట‌కేల‌కు క్రేజీ కాంబినేష‌న్ లో భారీ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కింద‌ని నెట్టింట సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇదిలా వుంటే మ‌హేష్ ఫ్యాన్స్ మ‌రింత‌గా ఎగ్టైట్ అయ్యే న్యూస్ అఒక‌టి తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది. SSMB28 మూవీని త్రివిక్ర‌మ్ హైవోల్టేజ్ యాక్ష‌న్ సీక్వెన్స్ నేప‌థ్యంలో ప్రారంభించేశాడు.

ఈ షెడ్యూల్ నెల రోజుల పాటు ఏక ధాటిగా సాగ‌నుందట‌. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ కె.ఎల్‌. నారాయ‌ణ అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌బోతున్నారు. భారీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ గా ఈ మూవీని రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్ ఎలా వుంటుంది? .. ఎప్ప‌డు సెట్స్ పైకి రాబోతోంది? అని గ‌త కొన్ని నెలలుగా అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స‌ర్ పైజ్ న్యూస్ తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది. ఈ మూవీని వ‌చ్చే ఏడాది అంటే 2023 జ‌న‌వ‌రి 26న గ్రాండ్ గా లాంచ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ట‌.

జ‌న‌వ‌రి వ‌ర‌కు స్క్రిప్ట్ వ‌ర్క్ ని పూరి చేయాల‌ని రాజమౌళి ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఆఫ్రికా అడ‌వుల నేప‌థ్యంలో సాగే అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొంద‌నున్న ఈ మూవీ కోసం స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ప‌వ‌ర్ ఫుల్ స్క్రిప్ట్ ని అందించార‌ని తెలుస్తోంది.

సౌత్ ఆఫ్రిక‌ ర‌చ‌యిత విల్బ‌ర్ స్మిత్ న‌వ‌లల స్ఫూర్తితో మ‌హేష్ మూవీని రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయికి మించి ఈ మూవీ వుండే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.