Begin typing your search above and press return to search.

తమిళ మార్కెట్ కోసం ప్రభాస్ కి తప్పలేదు..!

By:  Tupaki Desk   |   8 Nov 2022 5:09 AM GMT
తమిళ మార్కెట్ కోసం ప్రభాస్ కి తప్పలేదు..!
X
బాహుబలితో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ అప్పటి నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. నేషనల్ వైడ్ రిలీజ్ అంటే కేవలం తెలుగు నటులతోనే సినిమాలు చేస్తే వర్క్ అవుట్ అవదు. అందుకే ప్రభాస్ తన సినిమాల్లో పాన్ ఇండియా రేంజ్ లో అందరికి పరిచయం ఉన్న స్టార్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్, మారుతి మూవీ రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్) సెట్స్ మీద ఉన్నాయి. ఈ సినిమాల్లో రాజా డీలక్స్ ని త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. మారుతి డైరక్షన్ లో ఎంటర్టైనర్ మూవీగా ఈ ప్రాజెక్ట్ వస్తుంది.

పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్ ఏంటి మారుతి లాంటి డైరక్టర్ తో సినిమా చేయడం ఏంటని ఫ్యాన్స్ అప్సెట్ లో ఉన్నా ప్రభాస్ కి కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మూవీని కూడా పాన్ ఇండియా రిలీజ్ చేయాలని ప్లాన్. అందుకే ఇతర భాషా నటీనటులను తీసుకుంటున్నారు.

ముఖ్యంగా ప్రభాస్ రాజా డీలక్స్ లో కమెడియన్ గా తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు నటిస్తున్నారని తెలుస్తుంది. కోలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న కమెడియన్ యోగిబాబు తన కమెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆల్రెడీ తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న అతను ఇప్పుడు ప్రభాస్ రాజా డీలక్స్ కోసం పనిచేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ రామోజి ఫిల్మ్ సిటీలో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ షూటింగ్ కోసం యోగి బాబు హైదరాబాద్ వచ్చారు. ఆర్.ఎఫ్.సీలో లాంగ్ షెడ్యూల్ తో రాజా డీలక్స్ సినిమాలో ఇంపార్టెంట్ సీన్స్ అన్ని షూట్ చేసేలా ప్లాన్ చేశారట.

మారుతి ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తీస్తున్నాఉ. ఏమాత్రం తేడా వచ్చినా ప్రభాస్ ఫ్యాన్స్ తనని టార్గెట్ చేస్తారని కేర్ ఫుల్ గా ఉంటున్నారు. అయితే ఫ్యాన్స్ కి కావాలనే తక్కువ అంచనాలే సినిమా మీద ఉంచి వెండితెర పై అద్భుతాన్ని చూపించాలని ఫిక్స్ అయ్యాడు మారుతి.

ఆదిపురుష్ ఎలాగు సంక్రాంతి రావడం లేదని చెప్పేశారు. ప్రభాస్ సినిమాల విషయంలోనే ఈ రిలీజ్ వాయిదా లు ఎక్కువ జరుగుతుండటం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తుంది. ఆదిపురుష్ మాత్రం సినిమా టీజర్ పై వచ్చిన నెగటివ్ రివ్యూస్ ని ఓవర్ కం చేసేందుకే సినిమాని మళ్లీ రీ ఎడిట్ చేస్తున్నారని తెలుస్తుంది. ప్రభాస్ లాంటి కటౌట్ పెట్టుకుని టీజర్ లో కార్టూన్ బొమ్మల్లా చూపించడం ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఓం రౌత్ ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారని తెలుస్తుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.