Begin typing your search above and press return to search.

'పవన్'కోసం ఇంజనీర్ గా మారిన క్రియేటివ్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   19 May 2020 1:40 PM IST
పవన్కోసం ఇంజనీర్ గా మారిన క్రియేటివ్ డైరెక్టర్
X
టాలీవుడ్ పవర్ స్టార్ 'వకీల్ సాబ్' సినిమా షూటింగ్ లో బిజీ ఉండగానే తన తదుపరి చిత్రం పనులను శరవేగంగా మొదలుపెట్టాడు డైరెక్టర్ క్రిష్. పవన్ కళ్యాణ్ 26వ చిత్రం వకీల్ సాబ్ హిందీ నుండి రీమేక్ చేస్తుండగా ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజకీయాల తర్వాత పవర్ స్టార్ రీఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. అలాంటిది తదుపరి చిత్రం గురించి చిన్న వార్త తెలిసినా అభిమానులకు పండగే. పవర్ స్టార్ నటించనున్న 27వ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాను ఏయం రత్నం నిర్మిస్తుండగా.. ఈ సినిమా మొఘలుల సామ్రాజ్యంలోని ఒక బందిపోటు కథతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇది మొగలాయిల కాలం నాటి కథ అని.. సినిమా అంతా కోహినూర్ వజ్రం చుట్టూ కథ నడుస్తుందని చెప్పి ఆసక్తి రేకెత్తించారు.

ఈ పీరియాడిక్ క‌థ‌ను క్రిష్ కూడా పవన్‌ ఇమేజ్ కి స‌రిపోయేలా తయారు చేసాడట. చారిత్రాత్మక చిత్రం కావడంతో భారీ సెట్లను ఆ కాలం నాటి నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే గొప్ప చిత్రంగా నిలుస్తుందని, పవన్ కళ్యాణ్ నటించనున్న తొలి చారిత్రాత్మక చిత్రం కనుక చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరి డైరెక్టర్ క్రిష్ చాలా కాలం గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ సినిమాపై పనిచేస్తున్నారు. రాజమౌళిలా సంవత్సరాల పాటు కాకుండా కొన్ని నెలలోనే షూటింగ్ పూర్తీ చేస్తాడని టాలీవుడ్ లో మంచి టాక్. ఇక సినిమాను తన స్టైల్ లో తక్కువ టైంలో పూర్తి చేయడానికి క్రిష్ సెట్ డిజైన్ కూడా రెడీ చేసి ఇంజనీర్ గా మారాడని టాక్. చూడాలి మరి ఈ పవర్ స్టార్ బందిపోటుగా తెరమీదకి ఎప్పుడు వస్తారో..!