Begin typing your search above and press return to search.

కొరటాల ఆలస్యం.. ఎన్టీఆర్ కు కలిసొచ్చిందే!

By:  Tupaki Desk   |   20 Jan 2023 11:30 AM GMT
కొరటాల ఆలస్యం.. ఎన్టీఆర్ కు కలిసొచ్చిందే!
X
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవ్వక ముందే ప్రకటించారు. కానీ ఇప్పుడు రిలీజ్ అయ్యి దాదాపుగా ఏడాది పూర్తవుతున్న ఇంకా పట్టాలెక్కించలేదు. మధ్యలో ప్రాజెక్టు నిలిచిపోయిందని కూడా కొన్ని వార్తలు రాగా వాటిని టీం ఖండిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమా ఘనంగా లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ కు అంతర్జాతీయంగా మంచి క్రేజ్ వచ్చి.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా అందుకుంది. ఇప్పుడు ఈ ఈవెంట్ జరుగుతూ ఉండడంతో అందరి కళ్ళు ఈ ఈవెంట్ మీద పడే అవకాశం కనిపిస్తోంది. దానికి తగినట్లుగానే కొరటాల శివ అండ్ టీం ఈవెంట్ ని మరింత గ్రాండ్ గా చేసేందుకు ఆర్ఆర్ఆర్ టీం మొత్తాన్ని ఈ లాంచింగ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా హాజరుకావాలని కోరినట్లుగా తెలుస్తోంది.

రాజమౌళి ఆయన కుటుంబం సహా రామ్ చరణ్ ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కొన్నాళ్లుగా మెగాస్టార్ చిరంజీవి కొరటాల మధ్య దూరం పెరుగుతుందని వార్తలు వచ్చాయి. చిరంజీవిని కూడా ఈ ఈవెంట్ కి ఆహ్వానించారు అనే ప్రచారం జరుగుతున్నా... అది ఎంతవరకు నిజమనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.

ఒకరకంగా ఎన్టీఆర్ అభిమానులైతే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒకపక్క ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ తో కలిసి నటించిన రామ్ చరణ్ వరుస సినిమాలను లైన్లో పెడితే ఎన్టీఆర్ మాత్రం ఎందుకో సైలెంట్ అయ్యారు అనే భావన వారందరిలో ఉంది.

ఆచార్య డిజాస్టర్ కావడంతో ఎక్కువగా కథ మీద దృష్టి పెట్టడంతోనే కొరటాల శివ ఈ సినిమా లేట్ చేశారనే వాదన మాత్రం వినిపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడు ఈ ముహూర్తానికి ఆర్ఆర్ఆర్ టీం మొత్తం హాజరైతే నేషనల్ లెవెల్ లో ఎన్టీఆర్ 30 గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను కొరటాల శివ స్నేహితుడు సుధాకర్, ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.