Begin typing your search above and press return to search.

NTR30 : ఆమె కన్ఫర్మ్‌.. అఫిషియల్ బ్యాలన్స్‌

By:  Tupaki Desk   |   6 Jan 2023 7:30 AM GMT
NTR30 : ఆమె కన్ఫర్మ్‌.. అఫిషియల్ బ్యాలన్స్‌
X
ఎన్టీఆర్‌.. కొరటాల కాంబో సినిమా షూటింగ్ గురించి ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేయబోతున్నట్లుగా తేదీని కూడా ప్రకటించిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఒకింత రిలాక్స్ అయ్యారు. షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో హీరోయిన్‌ విషయంలో స్పష్టత ఇచ్చేందుకు మేకర్స్‌ సిద్ధం అయ్యారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ 30 సినిమాలో ఇప్పటికే హీరోయిన్‌ గా జాన్వీ కపూర్ ను ఎంపిక చేశారని.. గత కొన్ని రోజులుగా పారితోషికం మరియు ఇతర విషయాల గురించి చర్చలు జరిగాయని.. అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడంతో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది అంటూ ఎన్టీఆర్‌ 30 చిత్ర యూనిట్‌ సభ్యులు అఫిషియల్‌ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.

ఆచార్య సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో ఎన్టీఆర్‌ 30 ఆలస్యం అయ్యింది. దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్‌ విషయంలో కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. లేట్‌ అయినా కూడా అద్భుతమైన ఒక కథను ఎన్టీఆర్‌ కోసం కొరటాల రెడీ చేసినట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఎన్టీఆర్ మరియు కొరటాల గతంలో జనతా గ్యారేజ్ సినిమా కోసం వర్క్ చేశారు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సినిమా రానుండటం.. ఈ సినిమా తో జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ లో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.

శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్‌ తెలుగు లో ఇప్పటి వరకు ఒక్క సినిమా చేయకున్నా విపరీతంగా క్రేజ్ ను దక్కించుకుంది. సోషల్‌ మీడియాలో జాన్వీ కపూర్‌ ఫొటో షూట్స్ రెగ్యులర్‌ గా ఇక్కడ కూడా వైరల్‌ అవుతూనే ఉంటాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.