Begin typing your search above and press return to search.

NTR 30: సడన్ గా ఉప్పెన పాప అంటారేంటి?

By:  Tupaki Desk   |   12 Oct 2022 1:30 PM GMT
NTR 30: సడన్ గా ఉప్పెన పాప అంటారేంటి?
X
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఎప్పుడు సినిమా మొదలుపెడతాడో తెలియదు కానీ ఆ సినిమా మొదలయ్యే వరకు అనేక రకాల రూమర్స్ మాత్రం వైరల్ అవుతుంటాయి అని అనిపిస్తోంది. ఇప్పటికి ఈ సినిమా కథలో చాలా మార్పులు చేశారు అని.. అసలు మొదట అనుకున్న కథ కాదు అని.. జూనియర్ ఎన్టీఆర్ మరో కథను ఓకే చేసినట్లు ఇప్పటికే అనేక రకాల కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే అలాంటి రూమర్స్ ఎన్ని వైరల్ అవుతున్నా కూడా చిత్ర యూనిట్ ఇంతవరకు ఒక్క క్లారిటీ కూడా ఇచ్చింది లేదు. అసలు ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతుంది అనే విషయంలో కనీసం క్లారిటీ ఇచ్చినా బాగుండు అని అభిమానుల నుంచి కూడా ఒక డిమాండ్ అయితే వస్తోంది. ఇక ఇప్పుడు సడన్ గా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి పేరు కూడా ఈ ప్రాజెక్టులో ఉన్నట్లు మరొక రూమర్ వైరల్ గా మారింది.

అయితే మొదట ఆమె ఎన్టీఆర్ తో నటించడానికి ఒప్పుకున్నప్పటికీ ఆ తర్వాత కథ నచ్చకపోవడంతో మళ్లీ వెంటనే రిజెక్ట్ చేసినట్లుగా కూడా సోషల్ మీడియాలో ఓ వర్గం వారు తీవ్రస్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు.

అయితే ఇది ఫ్యాన్స్ వార్ లో భాగంగానే ప్రచారం చేసింది అని తెలుస్తోంది. నిజానికి అసలు ఎన్టీఆర్ సినిమాకు ఇప్పటికే చాలామంది హీరోయిన్ల పేర్లు ఆప్షన్స్ లో ఉన్నాయి. దాదాపు అందులో అందరూ కూడా నటించేందుకు రెడీ గానే ఉన్నారు.

ముఖ్యంగా ఇటీవల రష్మిక మందన్న కూడా ఒక హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు క్లారిటీ ఇచ్చింది. ఇక మరొక హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు ఫైనల్ చేయాల్సి ఉంది. కానీ కృతి షెట్టి ని మాత్రం అసలు చిత్ర యూనిట్ సభ్యులు ఏమాత్రం కలవలేదు అని తెలుస్తోంది.

ఇక ఫ్యాన్ వార్ లో భాగంగా అయితే ఇలాంటి ప్రచారాలు ఓ వర్గం వారిని కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నాయి. ఇలాంటి రూమర్స్ వైరల్ కాకముందే చిత్ర యూనిట్ సభ్యులు సినిమాపై ఏదో ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.