Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ 30 అప్డేట్‌... ఎన్టీఆర్‌ ని మళ్లీ కష్టబెడుతున్నాడట

By:  Tupaki Desk   |   8 Aug 2022 2:30 PM GMT
ఎన్టీఆర్‌ 30 అప్డేట్‌... ఎన్టీఆర్‌ ని మళ్లీ కష్టబెడుతున్నాడట
X
ఎన్టీఆర్‌ 30 సినిమా అతి త్వరలో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ ఒక కొలిక్కి వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. మరో వైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ ను కూడా దర్శకుడు కొరటాల శివ మొదలు పెట్టాడని సమాచారం అందుతోంది.

ఆర్ ఆర్ ఆర్‌ సినిమాలో చాలా విభిన్నంగా కనిపించిన ఎన్టీఆర్‌ ఇప్పుడు కొరటాల శివ సినిమాలో కాస్త సన్నగా కనిపించాల్సి ఉందట. అందుకే ఇప్పటికే సన్నబడేందుకు వర్కౌట్ లు మొదలు పెట్టాడట. ఇందుకు గాను ప్రముఖ ఫిట్నెస్‌ ట్రైనర్‌ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ వర్కౌట్స్ చేస్తున్నాడని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గతంలో కూడా లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్కౌట్స్ చేసి సిక్స్ ప్యాక్ ను చేసిన విషయం తెల్సిందే. మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్‌ బరువు తగ్గడంతో పాటు కొత్త ఫిజిక్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. అందుకోసం లాయిడ్ స్టీవెన్స్ చాలానే ఎన్టీఆర్‌ ని కష్టపెడుతున్నాడని అంటున్నారు.

కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్‌ ఫిజిక్ కు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఏమాత్రం వెనక్కి పోకుండా ఎన్టీఆర్‌ తన 30వ సినిమాకు సంబంధించిన లుక్ ను ట్రై చేస్తున్నాడు.

సెప్టెంబర్‌ లేదా అక్టోబర్ లో షూటింగ్ లో ఎన్టీఆర్‌ జాయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఫిల్మ్‌ నగర్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా కు ఒక నిర్మాతగా నందమూరి కళ్యాణ్ రామ్‌ వ్యవహరించబోతున్న విషయం తెల్సిందే. ఆయన తాజాగా మాట్లాడుతూ ఆర్ ఆర్‌ ఆర్‌ వంటి భారీ సినిమా తో వచ్చిన తారక్‌ ను అంతకు మించి చూపించేందుకు కాస్త ఎక్కువ సమయం తీసుకోవాలి. అందుకే స్క్రిప్ట్‌ మేకింగ్‌ కు కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు.