Begin typing your search above and press return to search.

NBK107 : బాబోయ్‌ బోయపాటిని మించి పోయాడుగా

By:  Tupaki Desk   |   9 Jun 2022 4:35 AM GMT
NBK107 : బాబోయ్‌ బోయపాటిని మించి పోయాడుగా
X
నందమూరి బాలకృష్ణ చాలా సంవత్సరాల తర్వాత అఖండ సినిమా తో కమర్షియల్‌ గా బిగ్గెస్ట్‌ సక్సెస్ ను దక్కించుకున్నాడు. అఖండ సినిమా దాదాపుగా రెండు వందల కోట్ల వసూళ్లను దక్కించుకున్నట్లుగా యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అఖండ సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో బాలయ్య అంతకు మించి ఉండాలి అన్నట్లుగా వరుసగా భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్స్ ను కమిట్‌ అవుతున్నాడు.

అఖండ విడుదల అయిన వెంటనే బాలయ్య మరియు గోపీచంద్‌ మలినేని కాంబోలో ఒక సినిమా ప్రారంభం అయ్యింది. కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యం అయినా కూడా NBK107 షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే వచ్చిన బాలయ్య లుక్ సినిమా పై అంచనాలు భారీగా పెంచింది. గతంలో బాలయ్య సూపర్‌ హిట్‌ యాక్షన్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలో లుక్ కనిపిస్తుంది.

బాలయ్య ను మరోసారి అఖండ లో మాదిరిగా భారీ మాస్ ఎలిమెంట్స్ తో చూపించబోతున్నట్లు గా తాజా పోస్టర్స్ ను చూస్తే అర్థం అయ్యింది. ఇప్పుడు NBK107 ఫస్ట్‌ హంట్‌ అంటూ వీడియో ను విడుదల చేయబోతున్నారు. నేడు సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు బాలయ్య ఫస్ట్‌ హంట్‌ వీడియోను విడుదల చేయబోతున్నట్లుగా ఈ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

పోస్టర్‌ ను చూస్తుంటే గోపీచంద్‌ మలినేని ఓ రేంజ్ లో యాక్షన్‌ సన్నివేశాలను బాలయ్యతో చేయించినట్లుగా అనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. బాలయ్య ను బోయపాటి ఓ రేంజ్ లో యాక్షన్‌ సన్నివేశాల్లో చూపిస్తాడు. అలాంటి బోయపాటినే మించి పోయేలా గోపీచంద్‌ మలినేని చూపించబోతున్నాడేమో అంటూ ఈ పోస్టర్ చూస్తుంటే అనిపిస్తుంది.

పులిచర్ల 4 కిలో మీటర్లు అంటూ చూపించే కిలో మీటర్ రాయి పై రక్తపు మరకలు మరియు దానికి ఆనుకుని ఒక డిజైన్డ్‌ గొడ్డలి చూపించి సినిమా పై ఆసక్తి అమాంతం పెంచేశాడు. ఈ స్టైల్‌ లో బోయపాటి మాత్రమే చేయగలడు అనుకున్నాం. కాని గోపీచంద్‌ ఆయన్ను మించి పోయాడు అంటూ బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు టైటిల్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

కనీసం నేడు రాబోతున్న ఫస్ట్‌ హంట్‌ వీడియో లో అయినా టైటిల్‌ ను ప్రకటిస్తారా అనేది చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌ తో రూపొందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాది దసరా వరకు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.