Begin typing your search above and press return to search.
కింగ్ వందవ సినిమా కోసం ప్లాన్ ఏ..ప్లాన్ బీ?
By: Tupaki Desk | 12 Oct 2022 11:30 PM GMTకింగ్ నాగార్జున రీసెంట్ గా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'ది ఘోస్ట్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అక్కినేని అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ దసరా బరిలో నిలిచి ఆశించిన ఫలితాన్ని రాబట్టిలేకపోయింది. మరీ ముఖ్యంగా అక్కినేని అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. గత కొంత కాలంగా వరుస ఫ్లాపుల్లో వున్న నాగార్జున ఈ సినిమాతో అయినా కమింగ్ బ్యాక్ అవుతారని ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురుచూశారు. కానీ ఆశించిన ఫలితం లభించకపోవడంతో ఉసూరుమన్నారు.
ఇదిలా వుంటే గత కొన్ని రోజులుగా నాగార్జున వందవ సినిమాపై చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో నాగ్ వున్నారని, దర్శకుడు కూడా ఫైనల్ అయ్యాడని ప్రచారం మొదలైంది. ఆ ప్రాచారం నిజమేనని, నాగార్జునతో 'గాడ్ ఫాదర్' ఫేమ్ మోహన్ రాజా పని చేయబోతున్నాడని ఈ విషయాన్ని 'గాడ్ ఫాదర్' నిర్మాతలలో ఒకరైన ఎన్వీ ప్రసాద్ ఇటీవల వెల్లడించడంతో పూర్తి క్లారిటీ వచ్చేసింది.
అంతే కాకుండా దర్శకుడు మోహన్ రాజా కూడా ఇదే విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. నాగార్జునతో చేయబోయే సినిమాకు స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని, ఫైనల్ గా చెక్ చేసుకుని సినిమా ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఇది నాగార్జున నటించనున్న వందవ ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో నాగార్జున ప్లాన్ మారినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ కోసం ప్లాన్ ఏ, ప్లాన్ బీని ఫాలో అవ్వాలనుకుంటున్నారట.
భారీ అంచనాలు పెట్టుకున్న 'ద ఘోస్ట్ ' ఫ్లాప్ కావడంతో నాగార్జున వందవ సినిమా విషయంలో జాగ్రత్త పడుతున్నారట. వందవ సినిమా అంటే అంచనాలుంటాయి. ముందే ప్రకటించేసి అంచనాలు సెట్ చేయడం కంటే సినిమా పూర్తయి తనకు సూపర్ అనిపించిన తరువాతే ఇదే వందవ సినిమా అని ప్రకటించాలని నాగ్ భావిస్తున్నాడట.
లేదంటే గెస్ట్ రోల్స్ కలుపుకుని వంద కాబట్టి మామూలుగా ఎలాంటి హడావిడి లేకుండా రిలీజ్ చేసి హిట్టయితే అప్పుడు వందవ సినిమా అని ప్లాన్ మార్చాలని అనుకుంటున్నాడట. మరి నాగ్ ప్లాన్ మోహన్ రాజాతో చేయబోతున్న ప్రాజెక్ట్ విషయంలో ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.