Begin typing your search above and press return to search.

ఊరిస్తున్న మెగాస్టార్‌ మూడు ముక్కల ఆట!

By:  Tupaki Desk   |   25 Aug 2022 5:43 AM GMT
ఊరిస్తున్న మెగాస్టార్‌ మూడు ముక్కల ఆట!
X
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్ర నిరాశ పరిచిన విషయం తెల్సిందే. ఆ సినిమా చిత్రీకరణ సమయం నుంచే భారీ అంచనాలను మోస్తూ వచ్చింది. తీరా సినిమా విడుదల అయిన తర్వాత బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడిన విషయం తెల్సిందే. ఆచార్య నిరాశ పర్చిన కూడా చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలపై మెగా అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

చిరంజీవి బ్యాక్ టు బ్యాక్‌ గాడ్ ఫాదర్.. వాల్తేరు వీరన్న మరియు భోళా శంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. ఈ మూడు సినిమాలు ఇప్పటికే పూర్తి అయ్యి విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యాయి. ఇప్పుడు ఈ మూడు సినిమా లు కూడా మెగా అభిమానులను ఊరిస్తూ ఉన్నాయి. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడం ఖాయం అనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు.

ఈ మూడు సినిమాల విడుదల తేదీలు కూడా ఖరారు అయ్యాయి. మొదటగా గాడ్ ఫాదర్ ఈ దసరా సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్టోబర్ 5వ తారీకు అంటూ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించిన విషయం తెల్సిందే. మలయాళ సూపర్‌ హిట్‌ లూసీఫర్ కు రీమేక్ అయిన గాడ్‌ ఫాదర్‌ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యి సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఇక దసరా తర్వాత మరో పెద్ద సినిమా సీజన్ అయిన సంక్రాంతికి కూడా మెగా స్టార్‌ తన సినిమాను తీసుకు రాబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరన్న సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. వాల్తేరు వీరన్న సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ఆమధ్య యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటన చేశారు.

ఇక వచ్చే సమ్మర్ లో ఏప్రిల్‌ నెలలో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ సినిమాతో చిరంజీవి రాబోతున్నాడు. విడుదల తేదీ కూడా ఈ సినిమాకు ఫిక్స్ అయ్యింది. కనుక ఈ మూడు సినిమాలు మెగా అభిమానులకు పండుగ తీసుకు రావడం ఖాయం అంటున్నారు.

దసరా.. సంక్రాంతి.. మరియు సమ్మర్ సినిమాలకు చాలా ప్రత్యేక రోజులు. ఆ ప్రత్యేక రోజుల్లో ఈ మూడు సినిమాలతో చిరంజీవి సందడి చేయబోతున్న నేపథ్యంలో మెగా అభిమానులకు ఫుల్‌ గా ఎంటర్‌ టైన్మెంట్‌ ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.