Begin typing your search above and press return to search.

రాజా డీలక్స్ కాదు.. ఇంకా ఏదో స్పెషల్‌!

By:  Tupaki Desk   |   7 Sep 2022 2:30 AM GMT
రాజా డీలక్స్ కాదు.. ఇంకా ఏదో స్పెషల్‌!
X
యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది... సినిమా యొక్క పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. మొన్నటి వరకు ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారని.. ఆ టైటిల్‌ ను రిజిస్ట్రర్ చేయించారని కూడా వార్తలు వచ్చాయి.

ప్రభాస్‌ సినిమా అంటే పాన్‌ ఇండియా సినిమా అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మారుతి దర్శకత్వంలో రూపొందినా కూడా అది పాన్‌ ఇండియా సినిమానే అవుతుంది. పాన్ ఇండియా మార్కెట్‌ కు తగ్గట్లుగానే ఒక మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్‌ ను మారుతి ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఆ సబ్జెక్ట్‌ తప్పకుండా అక్కడి వారిని.. ఇక్కడి వారిని అందరినీ కూడా ఆకట్టుకుంటుందని అంటున్నాయి. అయితే రాజా డీలక్స్ టైటిల్‌ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా ఉంది కానీ.. ఇతర భాషల ప్రేక్షకులకు చేరువ అవ్వడం కాస్త ఇబ్బందే. అందుకే ఇప్పుడు ప్రభాస్.. మారుతి సినిమా కోసం ఒక స్పెషల్‌ టైటిల్ ను ఖరారు చేయాలని భావిస్తున్నారట.

మారుతి ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ తో పాటు టైటిల్‌ విషయంలో కూడా ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. షూటింగ్‌ ప్రారంభం కు దాదాపు గా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నెలలోనే షూటింగ్‌ ప్రారంభం అవుతుందని యూనిట్‌ సభ్యులు ఆఫ్ ది రికార్డ్‌ చెబుతున్నారు.

ఈ మధ్య కాలంలో వచ్చిన పాన్ ఇండియా సినిమాలు అన్నింటికి కూడా అన్ని భాషల్లో కలిపి ఒకే టైటిల్ ను పెడుతున్నారు. కనుక ఈ సినిమాకు కూడా అలాంటి ఒక కామన్ టైటిల్‌ ను ఖరారు చేసేందుకు మారుతి ప్రస్తుతం ఆలోచనల్లో పడ్డాడు. అతి త్వరలోనే ప్రభాస్ కోసం మారుతి ఒక మంచి పాన్ ఇండియా టైటిల్ ను ఖరారు చేసి అధికారికంగా ప్రకటన చేస్తాడేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.