Begin typing your search above and press return to search.

కియారా త‌ల్లి ఒప్పుకోక‌పోతే క‌ర‌ణ్ ప‌రిస్థితి ఏంటి?

By:  Tupaki Desk   |   25 Aug 2022 9:48 AM GMT
కియారా త‌ల్లి ఒప్పుకోక‌పోతే క‌ర‌ణ్ ప‌రిస్థితి ఏంటి?
X
బాలీవుడ్ అంథాల‌జీ 'ల‌స్ట్ స్టోరీస్' సంచ‌ల‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అందులో న‌టించిన ప్ర‌తీ పాత్ర హైలైట్. అన్నింటికి మించి కియారా అద్వాణీ బోల్డ్ అటెంప్ట్ అమ్మ‌డికి అక్క‌డ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చింది. ఆ పాత్ర‌కి అమ్మ‌డు విమ‌ర్శ‌కుల ప్ర‌శంలందు కుంది. అలాంటి పాత్ర లో న‌టించాలంటే? డేరింగ్ ఉండాలి. అవ‌న్నీ త‌న‌లో ఉన్నాయ‌ని కియారో నిరూపించింది.

అందుకే నేడు బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయింది. వాస్త‌వానికి ఆ పాత్ర కోసం ద‌ర్శ‌క-నిర్మాత‌లు చాలా మంది హీరోయిన్ల‌ని సంప్ర‌దించారు. కానీ ఎవ‌రూ అంత బోల్డ్ గా న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డంతో కియారా రంగంలోకి దిగింది. అయితే ఆ చాన్స్ కియారా కంటే ముందు కృతి స‌న‌న్ కి వ‌రించిన‌ట్లు కాఫీవిత్ క‌ర‌ణ్ టాక్ షోలో వెలుగులోకి వ‌చ్చింది.

ఈ టాషోకి తాజాగా కియారా.. షాహిద్ క‌పూర్ అతిధులుగా విచ్చేసారు. ఈ సంద‌ర్భంగా క‌ర‌ణ్ ఆ సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. క‌ర‌ణ్ ఏమ‌న్నారంటే? '' నిజానికి ఆ పాత్ర కోసం ముందుగా కృతిస‌న‌న్ తీసుకోవాల‌నుకున్నాం. ఆమె కూడా న‌టించ‌డానికి రెడీగానే ఉంది. కానీ ఇంత‌లో ఆ పాత్ర‌లో న‌టించొద్ద‌ని త‌న త‌ల్లి కోరిందిట‌. అప్పుడే హీరోయిన్ అంద‌రి త‌ల్లులు కూడా అలాగే రియాక్ట్ అవుతారేమోన‌ని డౌట్ వ‌చ్చింది.

కానీ ల‌క్కీగా కియారాతో అలాంటి స‌మ‌స్య రాలేదు. వాస్త‌వానికి ఇది చాలా మంచి క‌థ‌. అమ్మా యిల ఇబ్బంది గురింఇ చెప్పే రోల్ అది. మంచి విష‌యం గురించి చె ప్పే పాత్ర. కానీ నెగిటివ్ గా వెళ్తుంద‌ని కొంద‌రు భావించి ముందుకు రాలేదు. ఆ స‌మ‌యంలోనే కియారాని మ‌నీష్ మ‌ల్హోత్రా ఇంట్లో క‌లిసాను. క‌థ విన‌డానికి మ‌రుస‌టి రోజు నా ఇంటికి ర‌మ్మ‌న్నాను.

క‌థ విని కియారా కూడా సందేహ‌ప‌డింది. కానీ నేనే డైరెక్ట్ చేస్తున్నాను ఇబ్బంది ఏమీ ఉండ‌ద‌ని చెప్పాను. అప్పుడే కియారా కూడా న‌టించ‌డానికి ఒప్పుకుంది. లేదంటే ఆమె కూడా అంగీక‌రించేది కాదేమో. అదే జ‌రిగి ఉంటే నా ప‌రిస్థితి ఏంటో అంటేఊ న‌వ్వేసారు' క‌ర‌ణ్.

ఈ అంథాల‌జీ స్టోరీకి అనురాగ్ క‌శ్య‌ప్..జోయాఅక్త‌ర్.. దిబాక‌ర్ బెన‌ర్జీ..క‌ర‌ణ్ జోహ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయి సంచ‌ల‌న విజ‌యం సాధించింది. త్వ‌ర‌లో ల‌స్ట్ స్టోరీస్ -2 కూడా మొద‌ల‌వుతుంది. ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది.