Begin typing your search above and press return to search.

'కాంతార' ప్రీక్వెల్.. ఊర మాస్ లెక్క సీక్వెల్!

By:  Tupaki Desk   |   24 March 2023 10:30 AM IST
కాంతార ప్రీక్వెల్.. ఊర మాస్ లెక్క సీక్వెల్!
X
క‌న్న‌డ చిత్రం 'కాంతార' పాన్ ఇండియాలో ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో తెలిసిందే. 16 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన సినిమా బాక్సాఫీస్ 400 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి స‌రికొత్త రికార్డును న‌మోదు చేసింది. రిష‌బ్ శెట్టి స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా ఈ స్థాయి స‌క్సెస్ సాధిస్తుంద‌ని క‌నీసం ఊహ‌కి కూడా రానిది. ఆ ర‌కంగా క‌న్న‌డ ప‌రిశ్ర‌మ పేరు మ‌రోసారి దేశ వ్యాప్తంగా మారుమ్రోగింది.

శివ అనే సగటు కుర్రాడిలా రిష‌బ్ శెట్టి నటన మామూలే కానీ.. కోళం ఆట ఆడే దైవదూత పాత్రలో అతడి అప్పీయరెన్స్.. పెర్ఫామెన్స్ మాత్రం ఎప్ప‌టికీ గుర్తిండిపోయేది. దేవుడంటే న‌మ్మ‌ని శివ చివ‌రికి దైవంగా మారే క్లైమాక్స్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. క‌థ ఆరంభంలో సాధార‌ణ క‌థ‌లా మొద‌లైన ముగింపు మాత్రం సినిమాని ప‌తాక స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఉగాది సంద‌ర్భంగా నిన్న‌టి నుంచి స్ర్కిప్ట్ ప‌నులు కూడా మొద‌లు పెట్టారు. ఈసారి అన్ని భాష‌ల్ని దృష్టిలో పెట్ట‌కుని భారీ అంచ‌నాల‌తో ఈ చిత్రాన్ని తెర‌క‌కెక్కించ‌డానికి రంగం సిద్దం చేస్తున్నారు.

దీనిలో భాగం స్ర్కిప్ట్ ప‌రంగా మ‌రింత లోతుగా వెళ్తున్న‌ట్లు తెలుస్తుంది. సీక్వెల్ అని ప్ర‌క‌టించారు గానీ...ఇది పూర్తిగా ప్రీక్వెల్ అని తెలుస్తోంది. శివ తండ్రి పాత్ర‌ని సినిమాలో ప్ర‌ధానంగా హైలైట్ చేయ‌బోతున్న‌ట్లు క‌థ‌నాలొస్తున్నాయి.

అస‌లు కాంతార -2 ఎలా ఉండ‌బోతుంది? ఇందులో ఏ నేప‌థ్యాన్ని చూపించ‌బోతున్నారు? అన్న ఎగ్టైట్ అభిమానుల్లో మొద‌లైంది. కాంతార లో మనం చూసిన క‌థ కంటే ముందు క‌థ‌ని 'కాంతార‌-2'లో చూపించే అవ‌కాశం ఉంది. కాంతార సినిమా ప్రారంభంలో హీరో తండ్రి మాయ‌మ‌వుతాడు. అస‌లు ఆయ‌న ఎక్క‌డి వెళ్లాడు? 'కాంతార' క‌థ ఎక్క‌డ మొద‌లైందన్న‌ది ప్రీక్వెల్ లో చూపించ‌బోతున్న‌ట్లు గెస్సింగ్ వ‌స్తున్నాయి.

హీరో తండ్రి జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌లేంటి? ఆ రాజు వంశం ఆ ఊరు వాళ్ల‌కు భూములిచ్చిన త‌ర్వాత ఏమైంది? వంటి అంశాలు 'కాంతార‌-2'లో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. అంటే కాంతార కంటే కాంతార‌-2 మ‌రింత మాస్ కోణంలో క‌థ సాగనుంద‌ని తెలుస్తుంది. అందుకోసం ద‌శాబ్ధాల క్రితం నాటి కొళం ఆట నాటి చ‌రిత్ర‌ను మ‌రింత లోతుగా అధ్య‌యంన చేస్తున్న‌ట్లు వినిపిస్తుంది.