Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 6 : గీతు రాయల్ ఏడిపించేసింది..!

By:  Tupaki Desk   |   7 Nov 2022 4:06 AM GMT
బిగ్ బాస్ 6 : గీతు రాయల్ ఏడిపించేసింది..!
X
బిగ్ బాస్ సీజన్ 6 లో 10వ వారం హౌస్ నుంచి గీతు రాయల్ ఎలిమినేట్ అయ్యింది. మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టంట్ అనుకున్న గీతు రాయల్ ఇంత సడెన్ గా ఎలిమినేట్ అవడం బిగ్ బాస్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో 10 మంది హౌస్ మెట్స్ ఉండగా శనివారం ఇద్దరిని సేవ్ చేసిన నాగార్జున ఆదివారం మరో ఏడుగురిని సేవ్ చేశాడు. ఇక చివరగా శ్రీ సత్య, గీతుల మధ్య ఒకరు సేవ్ అయ్యి మరొకరు ఎలిమినేట్ అవుతారు. ఈ క్రమంలో గీతు ఎలిమినేట్ అని నాగ్ ఎనౌన్స్ చేశారు. అక్కడ మొదలైంది గీతు ఎమోషనల్ మూమెంట్.. దాదాపు అప్పటి నుంచి షో పూర్తయ్యే వరకు ఆమె ఏడుస్తూనే ఉంది.

తన ఎలిమినేషన్ ఏమాత్రం ఊహించని గీతు కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్ మెట్స్ అందరికి బాయ్ చెప్పి బిగ్ బాస్ లో తనకు ఇష్టమైన ప్లేస్ లలో కూర్చుని హౌస్ మెట్స్ అందరికి తన వైపు నుంచి ఏదైనా తప్పులుంటే క్షమించమని అడిగింది.

వెళ్తూ వెళ్తూ బిగ్ బాస్ కెమెరాలకు ముద్దుపెట్టి బిగ్ బాస్ ఐలవ్యూ.. నా జీవితాన్ని మార్చేశావ్ అంటూ ఎమోషనల్ అయ్యింది గీతు. ఇక స్టేజ్ మీద కూడా నాగార్జున ఎంత ఓదారుస్తున్నా సరే కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది గీతు.

తాను టాప్ 5 లో కాదు ఈసారి టైటిల్ విన్నర్ తానే అన్నట్టుగా అంచనాలతో ఉన్నానని.. ఈ ఎలిమినేషన్ అసలు ఊహించలేదని గీతు రాయల్ బాధపడ్డది. హౌస్ మెట్స్ కూడా స్టేజ్ మీద గీతు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అందరు చలించిపోయారు.

గీతు రాయల్ ఏడుస్తుంటే హౌస్ మెట్స్ మాత్రమే కాదు షో చూస్తున్న ఆడియన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. గీతు ఎమోషనల్ బరస్ట్ ని అర్ధం చేసుకున్న నాగ్ ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించారు. బిగ్ బాస్ ఛాన్స్ వస్తుందని ఊహించావా.. అది వచ్చింది.. ఇన్ని వారాలు హౌస్ లో ఉన్నావ్.. ఎక్కడో నువ్వు ఆడిన ఆట ఆడియన్స్ కి నచ్చలేదు. అందుకే ఎలిమినేట్ అయ్యావ్ అని అన్నారు నాగార్జున.

గీతు ఎమోషనల్ గా బిగ్ బాస్ స్టేజ్ దాటి వెళ్లింది. ఈ టైం లో నాగార్జున ఓ అద్భుతమైన డైలాగ్ చెప్పారు. కలలు నిజం కానప్పుడు.. హృదయం కల్లోలం అవుతుంది.. కన్నీళ్లుగా మారుతుంది.. దట్స్ గీతు ఫర్ యు అని చెప్పారు. నిజంగానే గీతు 10 వారాలకే హౌస్ నుంచి బయటకు వచ్చినా ఆమె ఆడిన ఆట తీరు ఈ సీజన్ లో గుర్తుండిపోతుంది. గీతు ఎలిమినేషన్ పై హౌస్ లో రేవంత్, ఆది రెడ్డి, బాలాదిత్య, శ్రీ సత్య, ఫైమాలు చాలా ఎమోషనల్ అయ్యారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.