Begin typing your search above and press return to search.

'డాన్-3' కోసం బాలీవుడ్ దిగ్గ‌జాల్నే దించేస్తున్నారా?

By:  Tupaki Desk   |   21 Sep 2022 7:13 AM GMT
డాన్-3 కోసం బాలీవుడ్ దిగ్గ‌జాల్నే దించేస్తున్నారా?
X
బాలీవుడ్ లో కొన్ని స‌క్సెస్ పుల్ ప్రాంచైజీల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పాన్ ఇండియా వైడ్ ఆ సినిమాలు మంచి వ‌సూళ్ల‌ను సాధించాయి. 'క్రిష్'...'ధూమ్'..'డాన్'.. 'ఆషీకి' లాంటి ప్రాంచైజీలు బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రాలుగా నిలిచాయి. వాటి నుంచి త‌దుప‌రి ఏ సినిమా రిలీజ్ అయినా అది బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న‌మే అన్న చందంగా క‌నిపిస్తుంది.

ఇప్ప‌టికే 'క్రిష్‌-4'..'ధూమ్-4' లాంటి చిత్రాల ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. అవి ఎప్పుడు తెర‌కెక్కుతాయా? అన్న‌ది క్లారిటీ లేదు గానీ వాటికి కొన‌సాగింపు క‌థ‌లైతే ఉన్నాయ‌ని బాలీవుడ్ ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు రివీల్ చేసారు. క్రిష్‌4..ధూమ్-4 చిత్రాలు ఎప్పుడైనా ప‌ట్టాలెక్క‌డానికి అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో డాన్ 3 ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే.

డాన్ లో అమితాబ‌చ్చ‌న్ న‌టించి అద‌ర‌గొడితే..డాన్ -2 బాద్ షా షారుక్ ఖాన్ న‌టించి బాక్సాఫీస్ ని షేక్ చేసారు. ఈ రెండు చిత్రాలు భారీ వ‌సూళ్ల‌ని సాధించాయి. ఈ నేప‌థ్యంలో డాన్ 3కి ప‌ర్హాన్ అక్త‌ర్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ఇటీవ‌లే రివీల్ చేసారు. మ‌రి డాన్3 లో అమితాబ్..షారుక్ క‌లిసి న‌టిస్తే ఎలా ఉంటుంది? వీళ్లిద్ద‌రికి తోడుగా ర‌ణ‌వీర్ సింగ్ కూడా బ‌రిలోకి దిగితే సీన్ ఇంకెలా ఉంటుంది? అన్న‌ది చె ప్పాల్సిన ప‌నిలేదు.

అభిమానులకు అది పెద్ద పండ‌గే క‌దా. ఇది సాధ్య‌మ‌వ్వ‌డానికి ఛాన్సెస్ ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే మెయిన్ లీడ్ కి షారుక్ని ఎంపిక చేసుకున్నారు. క‌థ ప‌రంగా కొన్ని మార్పులు చెప్ప‌డంతో దానికి సంబంధించిన ప‌నులు కూడా పూర్తిచేసారు. ఇప్పుడీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలోకి అమితాబ‌చ్చ‌న్..ర‌ణ‌వీర్ ని కూడా తీసుకొస్తే సినిమా స్థాయి మారుతుంద‌ని ప‌ర్హాన్ భావిస్తున్న‌ట్లు బాలీవుడ్ గుస‌గుస‌లాడుకుంటుంది.

ఈ స్టార్ లు ఇద్ద‌రికి కూడా సినిమాలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే బాగుంటుంద‌ని ప‌ర్హాన్ భావిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తే త‌ప్ప క్లారిటీ రాదు. ప్ర‌స్తుతం షారుక్ వేర్వేరు క‌మిట్ మెంట్ల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

అలాగే అమితాబ్..ర‌ణ‌వీర్ ప‌లు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ప‌ర్హాన్ అక్త‌ర్ ఎంతో బిజీ. ప‌ర్హాన్ మ‌ల్టీ ట్యాలెంటెడ్. మంచి న‌టుడే కాదు..ద‌ర్శ‌కుడిగా..సింగ‌ర్ గానూ బాలీవుడ్ లో స‌త్తా చాటుతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.