Begin typing your search above and press return to search.

ఇక్క‌డ బంద్.. కానీ అక్క‌డ షూటింగ్‌!

By:  Tupaki Desk   |   1 Aug 2022 11:30 AM GMT
ఇక్క‌డ బంద్.. కానీ అక్క‌డ షూటింగ్‌!
X
క‌రోనా త‌రువాత నిర్మాణ వ్య‌యంతో పాటు వేస్టేజీ కూడా బాగా పెరిగిపోయింద‌ని, అంతే కాకుండా ఆర్టిస్ట్ పారితోషికాలు భారంగా మారాయ‌ని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ స‌భ్యులు టాలీవుడ్ లో షూటింగ్ ల బంద్ ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆగ‌స్టు 1 నుంచి షూటింగ్ ల‌న్నీ నిలిపి వేస్తున్నామ‌ని, నిర్మాణంలో వున్న‌, షూటింగ్ కి రెడీ అవుతున్న సినిమాల షూటింగ్ లు కూడా ఆపేస్తున్నామ‌ని గిల్డ్ త‌రుపున దిల్ రాజు ఆదివారం ప్ర‌క‌టించారు.

ముందు గిల్డ్ బంద్ ని నిర్మాత‌ల మండ‌లి, చిన్న నిర్మాత‌లు వ్య‌తిరేకించినా చివ‌రికి వారి నిర్ణ‌యానికి జై కొట్టారు. దీంతో ఆగ‌స్టు 1 నుంచి టాలీవుడ్ లో షూటింగ్ ల‌న్నీ అర్థాంత‌రంగా నిలిచిపోయాయి. ఇదిలా వుంటే పేరున్న స్టార్ ప్రొడ్యూస‌ర్‌, గిల్డ్ లో కీల‌కంగా వున్న నిర్మాత చ‌డీ చ‌ప్పుడు కాకుండా త‌న సినిమా షూటింగ్ ని ఆప‌డం లేద‌ని, వైజాగ్ లో తాజా షెడ్యూల్ ని ప్రారంభించ‌డానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

దీంతో ఈ వార్త విన్న నిర్మాత‌లంతా విస్తూ పోతున్నారు. కార‌ణం షూటింగ్ ల‌బంద్ కు ప్ర‌ధానంగా ముందు నిల‌బ‌డి పిలుపునిచ్చిన స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు త‌న సినిమా షూటింగ్ ని వైజాగ్ లో ప్లాన్ చేసుకోవ‌డ‌మే ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. త‌మిళ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా దిల్ రాజు ఓ బైలింగ్వ‌ల్ మూవీని నిర్మిస్తున్నారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు. తెలుగులో 'వార‌సుడు' పేరుతో త‌మిళంలో 'వారీసు' పేరుతో ఈ మూవీని రూపొందిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ ని వైజాగ్ లో ప్లాన్ చేశార‌ట‌. అదేంటి ఇక్క‌డ బంద్ అని అక్క‌డ షూటింగ్ చేయ‌డం ఏంట‌ని చాలా మంది ప్రొడ్యూస‌ర్లు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అయితే దిల్ రాజు మాత్రం ఆస‌క్తిక‌ర‌మైన స్టోరీ వినిపిస్తున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌. విజ‌య్ తో చేస్తున్న సినిమా త‌మిళ సినిమా బై లింగ్వ‌ల్ మూవీ కాదు. త‌మిళ సినిమా. తెలుగులో డ‌బ్ చేస్తార‌ట‌. త‌మిళ సినిమాకు టాలీవుడ్ బంద్ కు ఎలాంటి సంబంధం లేద‌న్న‌ది తాజా వాద‌న‌.

మ‌రి అలాంట‌ప్పుడు ధ‌నుష్ తో చేస్తున్న 'సార్‌', శంక‌ర్‌, రామ్ చ‌ర‌ణ్ ల కాంబినేష‌న్ ల‌లో రూపొందుతున్న సినిమాలు కూడా తెలుగు సినిమాలు కాదంటారా? .. య‌ధేశ్చ‌గా షూటింగ్ చేసుకోవ‌చ్చంటారా? అని కొంత మంది నిర్మాత‌లు అనుమానాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. గిల్డ్ బంద్ కి అన్నీ తానూ ముందుండి బంద్ ప్ర‌క‌టించిన ఆయ‌నే పాటించ‌క‌పోతే మిగ‌తా వాళ్లు కూడా ఇలాంటి సాకులు చెప్పే ప్ర‌మాదం వుంది క‌దా? అని టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ కొంత మంది వాపోతున్నారట.