Begin typing your search above and press return to search.

బ్రో.. ఈమాత్రం మాస్ క్లిక్కయితే చాలు!

By:  Tupaki Desk   |   27 Jun 2023 5:41 PM IST
బ్రో.. ఈమాత్రం మాస్ క్లిక్కయితే చాలు!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో బ్రో అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ జెట్ స్పీడ్ లోనే నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే సినిమా పనులను కూడా తుది దశకు చేరుకున్నాయి. ఇక జూలై 28న సినిమాను విడుదల చేస్తున్న సందర్భంగా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ డోస్ కూడా పెంచేశారు.

తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుంది అని కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. తమిళంలో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న వినోదాయ సీతం రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆలస్యం చేయకుండా చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ డోస్ పెంచుతూ సినిమాకు మార్కెట్లో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తున్నారు.

ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను అకట్టుకునే విధంగా ఒక ప్లాన్ అయితే సెట్ చేసినట్లుగా తెలుస్తోంది. బ్రో సినిమాకు సంబంధించిన టీజర్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఇక టీజర్ అప్డేట్ ఇస్తూనే అదిరిపోయే పోస్టర్స్ కూడా వదులుతున్నారు. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుంగీ లుక్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక ఇప్పుడు అదే తరహాలో సాయి ధరంతేజ్ కూడా తన చిన్న మామతో పోటీపడుతూ లుంగీ లుక్కుతో కనిపించాడు. కాకపోతే లేటెస్ట్ ఫ్రెండ్ కు తగ్గట్టుగా తన జీన్స్ పై లుంగీ వేసి కనిపించాడు. ఈ పోస్టర్ అయితే ఫ్యాన్స్ కు మంచి కిక్ అయితే ఇచ్చింది. ఇక ఇదే తరహాలో మాస్ అప్డేట్స్ క్లిక్ అయితే మాత్రం బ్రో సినిమాకు బోనస్ అని చెప్పవచ్చు.

పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్, ఇక బ్యాగ్రౌండ్ లో త్రివిక్రమ్ సపోర్ట్ కాబట్టి సినిమాకు కావాల్సినన్ని అంశాలు పాజిటివ్ గానే ఉన్నాయి. కాకపోతే అప్డేట్స్ లో ఎక్కడ కూడా మితిమీరకుండా జాగ్రత్త పడితే బెటర్.

ఇక బ్రో టీజర్ అయితే ఈ వీక్ లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ఒక్క టీజర్ క్లిక్ అయితే మాత్రం మార్కెట్లో డిమాండ్ ను పెంచుకోవడం ఖాయం. మరి ఆ టీజర్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.