Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా కోసం అన్నిభాష‌ల్ని క‌లిపి కొడుతున్నారా?

By:  Tupaki Desk   |   1 Nov 2022 2:30 AM GMT
పాన్ ఇండియా కోసం అన్నిభాష‌ల్ని క‌లిపి కొడుతున్నారా?
X
ఉస్తాద్ రామ్ క‌థ‌నాయుడిగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వ‌లో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. రామ్ ఎన‌ర్జీని మ్యాచ్ చేస్తూ బోయ‌పాటి త‌న‌దైన శైలి యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా పాన్ ఇండియా కంటెట్ తో మ‌లుస్తున్నారు. ఇప్ప‌టికే 'అఖండ‌'తో బోయ‌పాటికి పాన్ ఇండియాలో మంచి గుర్తింపు ద‌క్కింది. 'అఖండ' పాన్ ఇండియా రిలీజ్ కాన‌ప్ప‌టికీ ఓటీటీ రూపంలో రీచ్ అవ్వ‌డంతోనే ఆ క్రేజ్ సాధ్య‌మైంది.

రామ్ సినిమా విష‌యంలో అలాంటి పాయింట్ త‌ప్ప‌నిస‌రి అని అంచ‌నాలున్నాయి. పాన్ ఇండియా అని ప్ర‌క‌టించి తెర‌క‌క్కిస్తోన్న నేప‌థ్యంలో ఆ అంచ‌నాలు అందుకునేలో బోయ‌పాటి గ‌ట్టిగానే శ్ర‌మిస్తున్న‌ట్లు స‌మాచారం.

సినిమా కోసం బోయ‌పాటి హాలీవుడ్ రిఫ‌రెన్స్ లో పెద్ద ఎత్తున తీసుకుంటున్నారుట‌. ముఖ్యంగా యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు సంబంధించి నెక్స్ట్ లెవ‌ల్లో ఉండాల‌ని డీప్ గానే రీసెర్చ్ చేస్తున్నారుట‌.

దీనిలో భాగంగా ప్రెంచ్..కొరియ‌న్ సినిమాల్ని ఎక్క‌వ‌గా స్ట‌డీ చేస్తున్న‌ట్లు ఉప్పందింది. వాటిలో యాక్ష‌న్ స‌న్నివేశాల స్ఫూర్తితో త‌న పాన్ ఇండియా సినిమా యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు రిఫరెన్స్ గా వాడుకుంటున్నారుట‌. అదే నిజ‌మైతే బోయ‌పాటి వేగాన్ని త‌ట్టుకోవ‌డం చిన్న విష‌యం కాదు. సాధార‌ణ సినిమాల్లోనే బోయ‌పాటి యాక్ష‌న్ స‌న్నివేశాల్లో విశ్వ‌రూపం చూపిస్తారు.

ఆయా స‌న్నివేశాల్లో భారీత‌నం క‌నిపిస్తుంది. వాస్త‌వికంగా ఉండ‌టం కోసం భారీగా వెచ్చిస్తారు. ఆ విష‌యంలో ఏమాత్రం రాజీ ప‌డ‌రు. అలాంటి బోయ‌పాటి పాన్ ఇండియా ఎంట్రీ విష‌యంలో ఇంకెత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌రిస్తారో? చెప్పాల్సిన ప‌నిలేదు.

యాక్ష‌న్ ప‌రంగా బోయ‌పాటి మ‌రోసారి శివ‌తాండ‌వం ఆడేయ‌డం ఖాయం. అలాగే కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలు విదేశాల్లో ప్ర‌త్యేకంగా ప్లాన్ చేస్తున్నారుట‌. వాటిని విదేశీ స్టంట్ మాస్ట‌ర్ల‌తోనే చిత్రీక‌రించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. వాటిలో బోయ‌పాటి మార్క్ ట‌చ‌ప్ త‌ప్ప‌ని స‌రి అని తెలుస్తోంది



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.