Begin typing your search above and press return to search.

బాలయ్య 'అన్‌ స్టాపబుల్‌' ట్రిపుల్‌ హంగామా

By:  Tupaki Desk   |   17 Nov 2022 4:59 AM GMT
బాలయ్య అన్‌ స్టాపబుల్‌ ట్రిపుల్‌ హంగామా
X
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్‌ షో కొత్త ఎపిసోడ్‌ కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి తెల్సిందే. ఈ కార్యక్రమం నుండి గత వారం కొత్త ఎపిసోడ్‌ రాకపోవడంతో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. ఈ వారం కృష్ణ మృతి కారణంగా కొత్త ఎపిసోడ్‌ ఉండక పోవచ్చు అని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో బాలయ్య అన్‌ స్టాపబుల్‌ కొత్త ఎపిసోడ్‌ అప్డేట్‌ వచ్చింది.

బాలయ్య తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్‌ కుమార్ ఈ షో లో పాల్గొనబోతుంది. అంతే కాకుండా మాజీ ముఖ్య మంత్రి నల్లారి కిరణ్ కుమార్‌ రెడ్డి మరియు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి లు తాజా ఎపిసోడ్‌ లో బాలయ్య తో సందడి చేయబోతున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయ్యిందని సమాచారం అందుతోంది.

రేపు ఈ ట్రిపుల్‌ హంగామా ఎపిసోడ్ ఉంటుందని ఆహా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే ఒక హీరోయిన్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి మరియు మాజీ అసెంబ్లీ స్పీకర్ ను తీసుకు రావడం ఒకింత విడ్డూరంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ చాలా కొత్తగా ఉందని సినీ జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు.

గత సీజన్ మొత్తం కూడా సినీ ప్రముఖులు మాత్రమే హాజరు అయ్యారు. కానీ ఈ సీజన్ లో మాత్రం మొదటి ఎపిసోడ్‌ లోనే చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ హాజరు అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత రెండు ఎపిసోడ్స్ లో యంగ్‌ హీరోలు హాజరు అయ్యారు. ఇక నాల్గవ ఎపిసోడ్‌ లో ఇలా సినీ మరియు రాజకీయ కలయిక లో గెస్ట్‌ లను తీసుకు రావడం కొత్తగా ఉందంటున్నారు.

వీరసింహారెడ్డి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కారణంగా అన్‌ స్టాపబుల్‌ కి బాలయ్య ఎక్కువ డేట్లు ఇవ్వలేక పోతున్నాడు అనేది మీడియా సర్కిల్స్ మాట. ఈ వారం తర్వాత ఇక నుండి కంటిన్యూ గా ఎపిసోడ్స్ స్ట్రీమింగ్‌ అవుతాయని అంటున్నారు. ఈ సీజన్ లో మొత్తం 15 నుండి 17 ఎపిసోడ్స్ ఉంటాయట.

బాలయ్య అన్‌ స్టాపబుల్‌ సీజన్‌ 2 లో ఈ ఎపిసోడ్‌ చాలా స్పెషల్‌ గా ఉంటుందని ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేడు ఎపిసోడ్‌ యొక్క ప్రోమో విడుదల అయ్యే అవకాశం ఉంది. స్ట్రీమింగ్‌ గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ఎపిసోడ్‌ రేపు స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది అనుకోవడానికి లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.