Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్ లీక్ : ఈవారం 'జబర్దస్త్‌' ఎలిమినేషన్‌

By:  Tupaki Desk   |   8 Oct 2022 11:30 AM GMT
బిగ్‌ బాస్ లీక్ : ఈవారం జబర్దస్త్‌ ఎలిమినేషన్‌
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 6 అయిదవ వారం ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటికే హౌస్ నుండి నలుగురు ఎలిమినేట్‌ అవ్వగా నేడు చిత్రీకరించిన రేపటి ఎపిసోడ్‌ లో చలాకీ చంటి ఎలిమినేట్‌ అవ్వబోతున్నట్లుగా స్టార్‌ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గతంలో బిగ్‌ బాస్ వీకెండ్‌ ఎలిమినేషన్‌ గురించి వచ్చిన లీక్‌ లు దాదాపుగా అన్నీ కూడా నిజం అయ్యాయి. కనుక ఈ వారం లీక్ కూడా నిజం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

జబర్దస్త్‌ ద్వారా ఎంతో పాపులారిటీని దక్కించుకున్న చలాకీ చంటి కి తప్పకుండా మంచి ఓట్లు పడుతాయి.. అతడి కంటే కనీసం ముక్కు మొహం తెలియని వారు చాలా మంది ఉన్నారు. చంటీ ఈజీగా సేవ్‌ అవుతాడు అంటూ ఆయన అభిమానులు అనుకుని ఉంటారు.

కానీ అనూహ్యంగా హౌస్ లో ఆయన యొక్క ప్రవర్తన పదే పదే ఇతరుల పట్ల అవమానకరంగా మాట్లాడుతాడు అనే ఒక అభిప్రాయం ఆయనకు మైనస్ చేసింది.

చలాకీ చంటి నుండి చాలా ఎంటర్‌ టైన్మెంట్‌ ను ప్రేక్షకులు ఆశించారు. కానీ ఆశించిన స్థాయిలో ఆయన ఎంటర్‌ టైన్‌మెంట్ ను ఇవ్వలేక పోయాడు. అంతే కాకుండా ఈ సీజన్ మొత్తానికి కూడా ఆయన కెప్టెన్ అయ్యే అవకాశంను కోల్పయాడు అంటే అంతటి చెత్త ఆటను ఆడుతున్నాడు.

రెండవ వారం నుండి ప్రతి వారం కూడా చంటి ఆట తీరు గురించి నాగ్‌ విమర్శించడం.. ఈ వారం చూపిస్తా సర్ అంటూ చంటి అనడం జరుగుతుంది. ఈసారి చూపిస్తా సర్ అంటూ నాగార్జునతో అనకుండానే బయటకు వచ్చేసే పరిస్థితి వచ్చింది. బిగ్‌ బాస్‌ నుండి ఇంత త్వరగా చంటి వస్తాడని ఊహించలేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నారు.

ఎంతో మంది నామినేషన్‌ లో ఉన్న కంటెస్టెంట్స్ కంటే కూడా చంటి వీక్ అని ప్రేక్షకులు భావించారు.. ఆయన ఎలిమినేట్‌ అయ్యాడు అంటూ బిగ్‌ బాస్ నిర్వాహకులు ఆఫ్‌ ది రికార్డ్‌ అంటున్నారు. ఈ ఎలిమినేషన్ విషయమై మరింత స్పష్టత క్లారిటీ రావాలంటే ఆదివారం ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయ్యే వరకు వెయిట్‌ చేయాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.