Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 6.. మెరీనా రెమ్యునరేషన్ ఎంతంటే?

By:  Tupaki Desk   |   21 Nov 2022 12:30 PM GMT
బిగ్ బాస్ 6.. మెరీనా రెమ్యునరేషన్ ఎంతంటే?
X
బిగ్ బాస్ 6వ సీజన్ ఊహించని ట్విస్ట్ లతో ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా ఎలిమినేషన్స్ లో అయితే ఈసారి బిగ్ బాస్ మతిపోయే విధంగా ట్విస్ట్ లు ఇస్తున్నాడు. కంటెస్టెంట్స్ ఆకట్టుకోకపోతే ఏ మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పకనే చెబుతున్నాడు. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వారిలో కొంతమంది టాప్ 5 లో ఉంటారని అనుకున్నారు.

కానీ వారు చేసిన తప్పుల కారణంగా బిగ్ బాస్ హౌస్ లో నుంచి పంపించేసాడు. ఇక 11వ వారం మెరీనా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆమె గత రెండు మూడు వారాల క్రితం వరకు కూడా చాలా బలమైన కంటెస్టెంట్ గానే ఇంట్లో నిలిచింది.

ఒక విధంగా ఆమె వెళ్లిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇంట్లో ఎవరితోనూ పెద్దగా గొడవలు పెట్టుకోలేదు. అలాగే టాస్కుల విషయంలో కూడా మెరీనా పెద్దగా ప్రభావం చూపించింది లేదు.

హౌస్లో ఏదో ఒక విధంగా హైలైట్ అవుతూ ఉండాలి. కానీ ఆమె కూల్ గా ఉండేందుకే ప్రయత్నం చేసింది. దాదాపు అందరూ కూడా ఆమెతో పాజిటివ్ గానే ఉన్నారు. కానీ చివరివారం మాత్రం మిగతా కంటెస్టెంట్ తో సరిగ్గా పోరాడా లేకపోయింది. ఇక మెరినా 11 వారాలు ఉంటుంది అని ఎవరు కూడా అనుకోలేదు. మొదట తన భర్తతో కలిసి వచ్చిన ఆమె నామినేషన్ లో కూడా ఇద్దరు ఒక జంటగా నిలిచారు.

కానీ ఆ తర్వాత బిగ్ బాస్ ఇద్దరిని విడగొట్టి ఎవరి ఆట వారిగా అనే క్లారిటీ ఇచ్చేశారు. ఇక మెరీనా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఏ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంది అంటే.. ఆమెకు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలోనే బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక వారానికి 35 వేల వరకు రెమ్యునరేషన్ అందుకున్న మెరీనా మొత్తంగా 11 వారాలకు 3 లక్షల 80 వేల వరకు పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఒక విధంగా ఇది ఆమెకు మంచి ఆదాయం అని చెప్పవచ్చు. తన కెరీర్ లోనే మొదటిసారి హై రేంజ్ లో జీతం అందుకున్న ఈ బ్యూటీ మరొక విధంగా క్రేజ్ అందుకుంది. మరి ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో ఆమె తన కెరీర్ ను ఇంకా ఏ విధంగా మలుచుకుంటుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.