Begin typing your search above and press return to search.

అవతార్ 2 బాక్సాఫీస్ టార్గెట్ ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   23 Nov 2022 9:30 AM GMT
అవతార్ 2 బాక్సాఫీస్ టార్గెట్ ఎంతో తెలుసా?
X
హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ అవతార్ 2: ద వే ఆఫ్ వాటర్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినిమా ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ప్రపంచం మెచ్చిన దర్శకుడు జేమ్స్ కెమెరూన్ తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉండడంతో మొత్తంగా 160 భాషల్లో విడుదల చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి ముఖ్యంగా టికెట్లు రేట్లు మాత్రం ఊహించని రేంజ్ లోనే ఉన్నాయి.అయితే అసలు అవతార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత బిజినెస్ చేయబోతోంది అసలు దాని బాక్స్ ఆఫీస్ టార్గెట్ అంతా వివరాల్లోకి వెళితే. మొదట అవతార్ పార్ట్ వన్ సినిమాను రూ.1200 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించగా అది వరల్డ్ వైడ్ గా రూ.18,957 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది.

ఇక ఇప్పుడు అవతార్ 2 ను 250 మిలియన్ డాలర్స్ లో నిర్మించారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1909  కోట్లతో సమానం. అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన బిజినెస్ బట్టి చూస్తే మొత్తంగా 2 బిలియన్ల డాలర్స్ ను అందుకోవాల్సి ఉంది.

ఇక ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపు 16 వేల కోట్లు. 2010లోనే అవతార్ మొదటి పార్ట్ 18 వేల కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు అవతార్ సెకండ్ పార్ట్ ఆ టార్గెట్ ను తప్పకుండా పూర్తి చేసే అవకాశం అయితే ఉంది.

ఇక సినిమా టికెట్ల రేట్లను బట్టి చూస్తే అవతార్ 2 సినిమా ఈ టార్గెట్ ను పూర్తి చేసుకోవడానికి మరి ఎక్కువ సమయం కూడా పట్టదు అని అనిపిస్తోంది. ముఖ్యంగా ఇండియాలో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ అయితే ఉంది. అత్యధికంగా బెంగళూరులో మల్టీప్లెక్స్ లలో  3D ఫార్మాట్ లో ఒక్క టికెట్ ను 1400 రూపాయలకు అమ్ముతున్నారు.

ఇక హైదరాబాదులో 350 రూపాయలకు 3D ఫార్మాట్ లో ఒక్కో టికెట్ అమ్ముతున్నారు. మొత్తంగా తెలుగు వెర్షన్ లోనే అవతార్ 2 సినిమా దాదాపు 100 కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అవతార్ ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చెప్పడం కష్టం కానీ తప్పకుండా మాత్రం గత రికార్డులన్నిటిని కూడా ఇది బ్రేక్ చేస్తుంది అని చిత్ర యూనిట్ నమ్ముతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.