Begin typing your search above and press return to search.

అమిగోస్ బాక్సాఫీస్.. ఫైనల్ లెక్క!

By:  Tupaki Desk   |   3 March 2023 6:30 PM IST
అమిగోస్ బాక్సాఫీస్.. ఫైనల్ లెక్క!
X
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న డిఫరెంట్ మూవీ కావడంతో దీనిపై ఆటోమేటిక్ గానే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అలాగే ఎన్టీఆర్ జై లవకుశ తర్వాత కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం మూడు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలలో నటించాడు. అయితే ఒకరితో ఒకరికి సంబంధం లేని ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచే కథగా దీనిని ఎస్టాబ్లిష్ చేశారు.

ఈ సినిమాలో విలన్ గా కూడా కళ్యాణ్ రామ్ కావడం విశేషం. రాజేంద్ర రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తనని నమ్మి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని చేశాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ తర్వాత బాగుందనే టాక్ తెచ్చుకున్న ఎందుకనో కలెక్షన్స్ పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు అని చెప్పాలి. ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యింది. దీంతో లాంగ్ రన్ లో ఈ మూవీ డిజాస్టర్ గా మారిపోయింది.

వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో హిట్స్ కొట్టిన మైత్రీ వారికీ అమిగోస్ తో డిజాస్టర్ వచ్చిందని చెప్పాలి. ఈ మూవీ ఓవరాల్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే నైజాం ఏరియాలో 1.54 కోట్లు, సీడెడ్ లో 98 లక్షలు, మిగిలిన ప్రాంతాలు కలుపుకొని తెలుగు రాష్ట్రాలలో లాంగ్ రన్ లో ఈ మూవీ 5.22 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.

రెస్ట్ ఆఫ్ ఇండియాలో 35 లక్షలు, ఓవర్సీస్ లో 74 లక్షలు ఈ మూవీ కలెక్ట్ చేసింది. ఈ లెక్కన మొత్తం కలెక్షన్ చూసుకుంటే 6.31 కోట్లు మాత్రమే రాబట్టింది.

ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ 15.50 కోట్లు కాగా కనీసం సగం మొత్తం కూడా అమిగోస్ సినిమా కలెక్ట్ చేయకపోవడం గమనార్హం. దీనిని బట్టి కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో భారీ డిజాస్టర్ మూవీగా అమిగోస్ మారిపోయింది అని చెప్పొచ్చు. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన కళ్యాణ్ రామ్ ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోకపోవడం కాస్తా ఆలోచించాల్సిన విషయం అని చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.