Begin typing your search above and press return to search.

చిరు..వెంకీ..ర‌వితేజ‌..నాగ్ ఒకే ప్రేమ్ లో?

By:  Tupaki Desk   |   23 Sep 2022 6:08 AM GMT
చిరు..వెంకీ..ర‌వితేజ‌..నాగ్ ఒకే ప్రేమ్ లో?
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా బాబి ద‌ర్శ‌త‌క్వంలో 'వాల్తేరు వీర‌య్య' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్. మెగా అభిమానులు విజిల్స్ వేసి ఆనందించే రేంజ్ లో సినిమా ఉంటుంద‌ని ఇప్ప‌టికే లీకులందాయి. చిరంజీవి పై బాబి అభిమానమంతా సినిమాలో క‌నిపిస్తుంద‌ని చెప్పిన మాట‌ల‌పై ఫ్యాన్స్ ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్నారు.

దానికి త‌గ‌ట్టే చిత్రాన్ని మ‌లుస్తున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి స‌వ‌తి త‌ల్లి కుమారుడు...సోద‌రుడి పాత్ర‌లో మాస్ రాజా ర‌వితేజ్ న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే ర‌వితేజ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అలాగే ఓ గెస్ట్ పాత్ర‌లో విక్ట‌రీ వెంక‌టేష్ కూడా న‌టిస్తున్న‌ట్లు ప్రంచారం సాగుతోంది. వెంకీ పై షూటింగ్ కూడా పూర్తి చేసిన‌ట్లు స‌మాచారం అందుతోంది.

వెంకీ ఇప్ప‌టికే పలువురు స్టార్ హీరోల చిత్రాల్లోనూ న‌టించిన నేప‌థ్యంలో చిరు ఆఫ‌ర్ ని ఎందుకు రిజెక్ట్ చేస్తారు? అన్న కోణంలో 'వాల్తేరు వీర‌య్య‌'లో న‌టించ‌డానికి ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో స్టార్ హీరో పేరు తెర‌పైకి వ‌చ్చింది. కింగ్ నాగార్జ‌న సైతం వీర‌య్య‌కి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న‌ట్లు ప్రచారం సాగుతోంది.

చిరు మాట‌ని కాద‌న‌లేక నాగ్ సైతం ఓ కీల‌క పాత్ర‌లో మెప్పిస్తున్నార‌ని వినిపిస్తుంది. చిరంజీవి-నాగార్జున స్నేహం గురించి చె ప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ లో ఎంతో కాలంగా స్నేహితులుగా మెలుగుతున్న స్టార్స్. ఒక‌రంటే ఒక‌రికి ఎంతో అభిమానం. ఇద్ద‌రు బిజినెస్ పార్ట‌ర్లు. ర‌వితేజ మిన‌హా వెంకీ..నాగ్ ఎంట్రీ కూడా అధికారికంగా ఖ‌రారైతే సినిమా్ స్పాన్ అంత‌కంత‌కు పెరుగుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

తెలుగు రాష్ర్టాల్లో ఆ స్టార్ హీరోల‌కు కోట్లాది మంది అభిమానులున్నారు. ఒక్కో స్టార్ హీరో సినిమానే 50 కోట్లు సునాయాసంగా వ‌సూళ్లు సాధిస్తుంది. అలాంటింది ఒకే ప్రేమ్ లో ఇంత మంది స్టార్లు క‌నిపిస్తే ఇంకే స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. తాజా స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో 'వాల్తేరు వీర‌య్య‌' పై క్రేజ్ అంకంత‌కు రెట్టింపు అవుతుంద‌న‌డంలో? ఎలాంటి సందేహం లేదు.

ఇది నిజ‌మైతే సంక్రాంతికి అభిమానులు పెద్ద పండ‌గ ముందుగానే వ‌చ్చేస్తుంది. మొత్తానికి టాలీవుడ్ లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఒక‌ప్ప‌డు ఏ హీరోకి ఆ హీరో సినిమా చేసుకునేవారు. ఒక‌రి సినిమాల్లో మ‌రొక‌రు న‌టించ‌డం అన్న‌ది చిరంజీవి జ‌న‌రేష‌న్ హీరోల్లో చోటు చేసుకోలేదు. అంత‌కు ముందు..ఆ త‌ర్వాత ఇలాంటి వాతావ‌ర‌ణం కనిపించిందిగానీ చిరు స‌మ‌కాలీకుల్లో అదెక్కాడా? క‌నిపించ‌లేదు. ఇంత కాలానికి టాలీవుడ్ లో సైతం బాలీవుడ్ త‌ర‌హాలో హీరోలంతా ఒకే ప్రేమ్ లో క‌నిపించ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.