Begin typing your search above and press return to search.

గుస‌గుస.. SSMB28 అప్పుడేనా వ‌చ్చేది?

By:  Tupaki Desk   |   23 Jun 2022 3:30 AM GMT
గుస‌గుస.. SSMB28 అప్పుడేనా వ‌చ్చేది?
X
SSMB28 వచ్చే ఏడాది సమ్మర్ లో విడుద‌ల కానుందా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని ఆల‌స్యంగా రానుంద‌ని గుస‌గుస‌లు వైర‌ల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప‌నుల్లో ఉన్న ఈ సినిమా జులై లో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఆ మేర‌కు త్రివిక్ర‌మ్ అండ్ టీమ్ స‌న్నాహ‌కాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న మ‌హ‌ర్షి ఫేం పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.

ఇక‌పోతే మ‌హేష్ మూవీ సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకున్న‌ట్టు అధికారిక ప్ర‌క‌ట‌న అయితే లేదు. కానీ హింట్ మాత్రం స్ప‌ష్టంగా ఉంది. సితార బ్యాన‌ర్ లో తెర‌కెక్కుతున్న వైష్ణ‌వ్ తేజ్ మూవీని సంక్రాంతి 2023 బ‌రిలో రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌గానే ఇక ఇదే బ్యాన‌ర్ కి అనుబంధ బ్యాన‌ర్ హారిక అండ్ హాసిని లో తెర‌కెక్కుతున్న మ‌హేష్ మూవీని వాయిదా వేసిన‌ట్టేన‌ని ఊహిస్తున్నారు. కానీ దీనికి అధికారిక క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు.

సంక్రాంతి 2023 బ‌రిలో విజ‌య్ న‌టిస్తున్న 'వార‌సుడు' మూవీ విడుద‌ల కానుంది. ఇది కాకుండా ఇంకేవీ ఇప్ప‌టికి రేసులో లేవ్. ఇత‌ర హీరోల సినిమాలేవీ సంక్రాంతి డేట్ ని లాక్ చేయ‌లేదు. కానీ స‌న్నివేశం ఇప్ప‌టిలా ఉంటుందా? అంటే చెప్ప‌లేం.

ప‌వ‌న్ - చిరంజీవి- బాల‌కృష్ణ- ప్ర‌భాస్ స‌హా ప‌లువురు హీరోలు న‌టిస్తున్న సినిమాల్లో ఏదో ఒకటి సంక్రాంతి బ‌రిలో వ‌చ్చే వీలుంద‌న్న ఊహాగానాలు ఉన్నాయి.

ఇరుగు పొరుగు నుంచి భారీ అనువాద చిత్రాలు సంక్రాంతి విడుద‌ల‌ను ఎంచుకుంటాయ‌న‌డంలో సందేహం లేదు.