Begin typing your search above and press return to search.

ఉప్పెనంత హిట్టిస్తుందేమో చూడాలి

By:  Tupaki Desk   |   20 April 2022 4:45 AM GMT
ఉప్పెనంత హిట్టిస్తుందేమో చూడాలి
X
ల‌క్కీ ఛామ్ అంటే మీనింగ్ ఏమిటీ? బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌న్నీ హిట్లుగా మారితే ల‌క్కీ గాళ్ అని ల‌క్కీ ఛామ్ అని పిల‌వాలా? అంటే.. అభిమానుల‌కు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు కొల‌మానం 'హిట్టు' మాత్ర‌మే. ఒక్క ఫ్లాప్ వ‌చ్చినా మ‌ళ్లీ ఐర‌న్ లెగ్ అంటూ తీసి పారేస్తారు. అయితే కెరీర్ లో అప‌జ‌యం ఎరుగ‌ని భామ‌గా ఇప్ప‌టికే రికార్డులు బ్రేక్ చేస్తోంది కృతి శెట్టి.

తొలి చిత్రం ఉప్పెనతోనే 100 కోట్ల క్ల‌బ్ నాయిక అయ్యింది. రెండో సినిమా శ్యామ్ సింగరాయ్ కూడా సూపర్ హిట్. మూడవ చిత్రం బంగార్రాజు సంక్రాంతి హిట్ గా నిలిచింది. హ్యాట్రిక్ ల‌తో దూసుకెళుతున్న ఈ భామ సుధీర్ బాబు- రామ్ లాంటి హీరోల‌కు కూడా ల‌క్కీ ఛామ్ గా మారుతుందా? అంటూ విశ్లేష‌ణ సాగుతోంది.

కృతి శెట్టిని ఎంపిక చేసుకోవ‌డానికి కార‌ణం త‌న‌దైన అందం ప్ర‌తిభ‌తో పాటు ల‌క్కీ ఛామ్ అన్న కార‌ణం కూడా ఉంద‌న్న‌ గుస‌గుస వినిపిస్తోంది. రామ్ స‌ర‌స‌న లింగుస్వామి తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తోంది. అయితే దీని కంటే ముందే సుధీర్ బాబు- ఇంద్ర‌గంటి కాంబినేష‌న్ సినిమా విడుద‌ల‌కు రానుంది.

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టైటిల్ లోనే మ్యాజిక్ క‌నిపించింది. సుధీర్ బాబుకి హిట్టు కొట్టాల్సిన త‌రుణ‌మిది. కానీ ఈ సినిమా ఈపాటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. వీ - చిత్రం ఆ ఇద్ద‌రికీ ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. కానీ ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో స‌మ్మోహ‌నం లాంటి హిట్ సినిమా ఉంది. అందువ‌ల్ల దానిని తిరిగి రిపీట్ చేస్తారా? అన్న ఆస‌క్తి నెల‌కొంది.

ప్రస్తుతం కృతి రామ్ న‌టిస్తున్న 'ది వారియర్' లోనూ నాయిక‌. సూర్య-బాల టైటిల్ లేని సినిమాలోనూ నాయిక‌గా నటిస్తోంది. సుధీర్ బాబుకి ఒక హిట్టిచ్చి రామ్ లాంటి హీరోకి కూడా ల‌క్కీ ఛామ్ గా మారుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఒక‌వేళ సుధీర్ బాబు చిత్రంతో ఫ్లాప్ ఎదుర్కొన్నా కానీ దాని ప్ర‌భావం కృతి కెరీర్ మీద ఉండే ఛాన్స్ లేదు.

ఎందుకంటే ఆ త‌ర్వాత వ‌రుస‌గా అన్నీ పాన్ ఇండియా చిత్రాల్లోనే కృతి న‌టిస్తోంది. ది వారియ‌ర్ తెలుగు-త‌మిళం- హిందీ మార్కెట్ ని టార్గెట్ చేసి విడుద‌ల చేయ‌నున్నార‌ని టాక్. అలాగే సూర్య అంటే తెలుగు-త‌మిళంలో త‌ప్ప‌నిస‌రిగా విడుద‌ల‌వుతుంది. ఇది కృతి బ్రాండ్ ఇమేజ్ ని అమాంతం పెంచేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.