Begin typing your search above and press return to search.

మైన‌స్ 8 డిగ్రీల చ‌లిలో శ్రీ‌దేవితో వాల్తేరు వీరయ్య‌..!

By:  Tupaki Desk   |   14 Dec 2022 2:09 PM GMT
మైన‌స్ 8 డిగ్రీల చ‌లిలో శ్రీ‌దేవితో వాల్తేరు వీరయ్య‌..!
X
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్న మాసీవ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌`లో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత ప్ర‌త‌ష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ మూవీని 2023 సంక్రాంతి కి జ‌న‌వ‌రి 13న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. చిరుకు జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలోని కీల‌క అతిథి పాత్ర‌లో మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌నిపించ‌బోతున్నాడు. త‌న‌కు జోడీగా కేథ‌రిన్ న‌టిస్తోంది.

రీసెంట్ గా ర‌వితేజ పాత్రని ప‌రిచ‌యం చేస్తూ ఓ గ్లింప్స్‌ని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో ర‌వితేజ విక్ర‌మ్ సాగ‌ర్ అనే ప‌వ‌ర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడు. ఇదిలా వుంటే సంక్రాంతికి ఈ మూవీని రెడీ చేస్తున్న మేక‌ర్స్ చిరంజీవి, శృతిహాస‌న్ ల‌పై ఓ ప్ర‌త్యేక గీతాన్ని ఫ్రాన్స్ లోని అంద‌మైన లొకేష‌న్ ల‌లో చిత్రీక‌రించారు. ఈ పాట‌ని 12న షూట్ చేశారు. ఇందుకు సంబంధించిన స‌ర్ ప్రైజింగ్ విశేషాల‌ని బుధవారం సాయంత్రం చెబుతానంటూ చిరంజీవి సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

అన్న‌ట్టుగానే ఇన్ స్టా గ్రామ్ లో ఆస‌క్తిక‌రమైన వీడియోని అభిమానుల కోసం షేర్ చేసి స‌ర్ ప్రైజ్ ఇచ్చారు. అంతే కాకుండా శృతిహాస‌న్ తో క‌లిసి చేసిన పాట‌లోని ఓ చ‌ర‌ణాన్ని మీ కోసం లీక్ చేస్తున్నానంటూ చ‌ర‌ణాన్ని లీక్ చేశారు. `నువ్వు శ్రీ‌దేవైతే.. నేను చిరంజీవి అవుతా.. ` అంటూ సాగే ఈ పాట‌ను ఫ్రాన్స్ లోని అంద‌మైన లోయ లేషై లో చిత్రీక‌రించారు. స్విట్జ‌ర్లాండ్, ఇట‌లీ బోర్డ‌ర్ లో వున్న ఆబ్స్ మౌంటెయిన్స్ స‌మీపంలో ఇది వుంద‌ట‌. సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ ఏరియాలో ఈ మంచు ఈ మంచు లోయ వుంద‌ని చిరు చెబుతున్నారు.

మైన‌స్ 8 డిగ్రీల చ‌లిలో అంద‌మైన లొకేష‌న్ ల‌లో మంచు కురుస్తుండగా చేశామ‌ని స‌ద‌రు లొకేష‌న్ కు సంబంధించిని విజువ‌ల్స్ ని అభిమానుల‌తో పంచుకున్నారు. `హాయ్ ఫ్రెండ్స్ నేను ఫ్రాన్స్ నుంచి మాట్లాడుతున్నాను. శృతిహాస‌న్ తో నేను చేసిన పాట 12న పూర్త‌యింది. నేను ప్ర‌త్యేకంఇచి మీతో ఈ విష‌యాల్ని ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే చాలా ఎక్సైటింగ్ గా విజువ‌ల్స్ , సాంగ్ అనిపించింది.
మేం చేసిన లొకేష‌న్స్ సో బ్యూటిఫుల్ లోయ అందాలు మంచుతో క‌ప్ప‌బ‌డి చాలా అందంగా వుంటాయి.

మైన‌స్ 8 డిగ్రీల చ‌లిలో స్టెప్స్ వేయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. టీమ్ అంతా చాలా క‌ష్ట‌ప‌డ్డారు. సాంగ్ చూసిన త‌రువాత మా క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం చాలా బాగా వ‌చ్చింద‌నిపించింది. ఆ ఆనందాన్ని ఆపుకోలేక ఆ లొకేష‌న్స్ ని మీకు చూపించాల‌ని మంచి మంచి వీడియోల‌ని మీకు చూపిస్తున్నాను. త్వ‌ర‌లోనే ఈ పాట‌ని రిలీజ్ చేయ‌బోతున్నాం. ఈ సాంగ్ కు సంబంధించిన లిరిక్‌ని మీకు లీక్ చేస్తున్నాను. ఎవ‌రీక చెప్ప‌కండి.. ఎంజాయ్‌.. ఓకే సీయూ సూన్‌` అంటూ ప్ర‌త్యేక విజువ‌ల్స్ కు సంబంధించిన వీడియోని అభిమానుల‌తో పంచుకున్నారు చిరు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.