Begin typing your search above and press return to search.

అప్పుడు మాత్ర‌మే 'కేజీఎఫ్ 3'ని చేస్తారా?

By:  Tupaki Desk   |   19 April 2022 5:53 AM GMT
అప్పుడు మాత్ర‌మే కేజీఎఫ్ 3ని చేస్తారా?
X
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ 'ట్రిపుల్ ఆర్‌'. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా అనూహ్యంగా వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. అంతే కాకుండా ప‌లు రాకార్డుల్ని సైతం తిర‌గ‌రాసింది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత బాక్సాఫీస్ వ‌ద్ద మాస్ జాత‌ర‌కు తెర‌లేపిన చిత్రం 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2'. రాకింగ్ స్టార్ య‌ష్ న‌టించిన ఈ చిత్రం రిలీజ్ డే నుంచి వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

ప్ర‌స్తుతం ఎక్క‌డ విన్నా.. ఏ నోట విన్నా ఒక‌టే మాట కేజీఎఫ్‌.. కేజీఎఫ్‌.. దాదాపు నాలుగేళ్ల విరామం త‌రువాత కేజీఎఫ్ ఫ్రాంఛైజీలో భాగంగా విడుద‌లైన ఈ మూవీ ఊహించ‌ని స్థాయిలో రికార్డుల మోత మోగిస్తోంది. బాక్సాఫీస్ వ‌ద్ద ఇప్ప‌టికే ప‌లు రికార్డుల్ని తిర‌గ‌రాసిన ఈ మూవీ తొలి రోజు ప్రారంభ వ‌సూళ్ల ప‌రంగా ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలోనే స‌రికొత్త రికార్డుని సృష్టించింది. ఈ మూవీ దెబ్బ‌కు బాలీవుడ్ క్రేజీ స్టార్ ల రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి.

ప్ర‌స్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఎక్క‌డా చూసినా.. దేశ వ్యాప్తంగా ట్రేడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలో వ‌సూళ్ల సునామీని సృష్టిస్తూ వ‌రుస రికార్డుల్ని తిర‌గ‌రాస్తూ ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలోనే స‌రికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఇదిలా వుంటే సినిమా చివ‌ర్లో అభిమానుల‌కు అదినిపోయే అప్ డేట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌. 'కేజీఎఫ్ 2'కు కొన‌సాగింపు వుంటుందని, 'కేజీఎఫ్ 3' చేస్తాన‌ని హింట్ ఇచ్చేశాడు.

అయితే దీనికి మ‌రింత స‌మ‌యం ప‌ట్టేలా క‌నిపిస్తోంది. క‌రోనా, ఇత‌ర‌త్రా కార‌ణాల వల్ల కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 కోసం దాదాపు నాలుగేళ్లు ప‌ట్టింది. అయితే ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నిల్ ఇద్ద‌రు టాప్ స్టార్ లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న నేప‌థ్యంలో 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 3' తెర‌పైకి రావ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. అందే కాకుండా దీనికి రెండు భాగాల‌కు మించి బ‌ల‌మైన నేప‌థ్యం కావాలి.. అలాంటి క‌థ సిద్ధ‌మైన త‌రువాతే చాప్ట‌ర్ 3 ని ప్ర‌శాంత్ నీల్ ప‌ట్టాలెక్కించే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ..పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో 'స‌లార్‌' మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు 30 శాతానికి మించి చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. ప్ర‌భాస్ గాయం కార‌ణంగా స‌ర్జ‌రీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న నేప‌థ్యంలో ఈ మూవీ షూటింగ్ మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అలాగే ఈ మూవీ ప్ర‌శాంత్ నీల్ .. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో సినిమా చేయ‌బోతున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించ‌బోతోంది.

ఈ రెండు చిత్రాల త‌రువాతే ప్ర‌శాంత్ నీల్ 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 3'ని చేసే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూవీని ఎప్పుడు చేసినా దీని కోసం ప్రేక్ష‌కులు భారీ స్థాయిలో ఎదురుచూస్తారు కాబ‌ట్టి నిదానంగా ప‌వ‌ర్ ఫుల్ స్టోరీతో చాప్ట‌ర్ 3 ని తెర‌పైకి తీసుకు రావాల‌ని ప్ర‌శాంత్ నీల్ భావిస్తున్నార‌ట‌. అంతే కాకుండా చాప్ట‌ర్ 2కి హిందీ బెల్ట్ లో భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తున్న నేప‌థ్యంలో చాప్ట‌ర్ 3 ని కూడా వారి అంచ‌నాల‌కు అనుగునంగా తెర‌పైకి తీసుకురావాల‌ని ప్ర‌శాంత్ నీల్ భావిస్తున్నార‌ట‌. అయితే ప్ర‌శాంత్ నీల్ త‌న‌కు ఎప్పుడైతే భారీ రేంజ్ హిట్ అవ‌స‌ర‌మ‌ని భావిస్తాడో అప్ప‌డే చాప్ట‌ర్ 3 ని రంగంలోకి దించేయాల‌నుకుంటున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్‌.