Begin typing your search above and press return to search.

అడివి శేష్ చిక్కుముడి విప్పేది ఆ రోజే

By:  Tupaki Desk   |   2 May 2022 6:30 AM GMT
అడివి శేష్ చిక్కుముడి విప్పేది ఆ రోజే
X
మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టించిన చిత్రం 'హిట్ : ద ఫ‌స్ట్ కేస్‌'. శైలేష్ కొల‌ను డైరెక్ట్ చేసిన ఈ మ‌ర్డ‌ర్ మిస్టరీ థ్రిల్ల‌ర్ హీరో విశ్వ‌క్‌సేన్ కు మంచి విజ‌యాన్ని అందించి త‌న కెరీర్ లో ఓ విభిన్న‌మైన అటెమ్ట్ అనిపించుకుంది. ఈ చిత్రాన్ని వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్ పై హీరో నేచుర‌ల్ స్టార్ నాని, ప్ర‌శాంతి త్రిపిర్నేని సంయుక్తంగా నిర్మించారు. తొలి పార్ట్ సూప‌ర్ హిట్ కావ‌డంతో దీనికి సీక్వెల్ గా 'హిట్ : ద‌ సెకండ్ కేస్‌' పేరు మ‌రో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీన్ని కూడా శైలేష్ కొల‌ను తెర‌కెక్కిస్తున్నాడు.

అడివి శేష్ హీరో. మీనాక్షీ చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో భాను చంద‌ర్‌, రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఫ‌స్ట్ పార్ట్ లో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని ఛేదించే ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా విశ్వ‌క్‌సేన్ న‌టించారు. పార్ట్ 1 హైద‌రాబాద్ నేప‌థ్యంలో సాగితే సెకండ్ కేస్ ని ఆంధ్రా నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నారు.

ఇందులో అడివి శేష్ హీరోగా ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. వైజాగ్ నేప‌థ్యంలో ఈ మూవీ సాగుతుంది. అక్క‌డ జ‌రిగిన ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని ఛేదించే అధికారిక‌గా అడివి శేష్ ఈ చిత్రంలో న‌టించారు.

గ‌త కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. అడివి శేష్ త‌ను న‌టిస్తున్న 'మేజ‌ర్' రిలీజ్ విష‌యంలో బిజీగా వుండ‌టంతో ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ని ఇంత వ‌ర‌కు మేకర్స్ కానీ, అడివి శేష్ కాని వెల్ల‌డించ‌లేదు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ మేక‌ర్స్ ప్ర‌క‌టించి స‌ర్ ప్రైజ్ ఇచ్చారు.

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని జూలై 29న విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ''హిట్ ప్ర‌పంచంలో ఏదో ప్ర‌మాద‌క‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌ప‌డ‌బోతోంది. జూలై 29న వెన్నులో వ‌ణుకు ప‌ట్టించే స‌స్పెన్స కోసం సిద్ధంగా వుండండి' అంటూ సోమ‌వారం హీరో అడివి శేష్ సోష‌ల్ మీడియా ట్వీట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

నేచుర‌ల్ స్టార్ నాని, ప్ర‌శాంతి త్రిపుర్నేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మ‌ర్డ‌ర్ మిస్ట‌రి థ్రిల్ల‌ర్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి. వ‌రుస‌గా థ్రిల్లింగ్ స్టోరీస్ తో వ‌స్తున్న అడివి శేష్ ఈ మూవీలో ఏ రేంజ్ లో పోలీస్ అధికారిక‌గా ఆక‌ట్టుకున్నారో తెలియాలంటూ జూలై 29 వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇదిలా వుంటే ఈ మూవీ ఫ‌స్ట్ పార్ట్ ని ఇప్ప‌టికే బాలీవుడ్ లో రాజ్ కుమార్ రావు, సాన్య మ‌ల్హోత్రాల‌తో దిల్ రాజు టీమ్ రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది.