Begin typing your search above and press return to search.

2016.. రాబోయే సినిమాలన్నీ సంథిగ్ స్పెషలే

By:  Tupaki Desk   |   9 March 2016 5:30 PM GMT
2016.. రాబోయే సినిమాలన్నీ సంథిగ్ స్పెషలే
X
ప్రతీ ఏటా కొత్త సినిమాలు - భారీ సినిమాలు - క్రేజీ ప్రాజెక్టులు ఉంటాయి కానీ.. ఈ ఏడాది సంథింగ్ స్పెషల్ అని చెప్పాల్సిందే. దీనికి కారణం ప్రతీ స్టార్ హీరో చేస్తున్న ప్రాజెక్టులన్నీ వేటికవే ప్రత్యేకమైనవే. డైరెక్టర్లు కూడా విభిన్నమైన రూట్ లో ప్రయాణించేందుకు సిద్ధం కావడం కూడా ఈ ఏడాది మరో ప్రత్యేకత. మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ మూవీని చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ సోలో హీరోగా సర్దార్ గబ్బర్ సింగ్ గా వస్తున్నాడు. అన్నీ తానై ఈ మూవీని నడిపిస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేస్తున్న బ్రహ్మోత్సవం కూడా క్రేజీ ప్రాజెక్టే. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో నటిస్తున్నాడు. ఈ మూవీలో మొదటిసారిగా సూపర్ స్టార్ ముగ్గురు భామలతో కలిసి నటిస్తుండడం విశేషం.

వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టిన కొరటాల శివతో.. నాన్నకు ప్రేమతో చిత్రం ద్వారా 50 కోట్లను అందుకున్న ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్ పై కూడా బోలెడన్ని అంచనాలున్నాయి. నాగ్ -కార్తీల మల్టీ స్టారర్ ఊపిరి కూడా విడుదలకు సిద్ధమయింది. ఈ మూవీలో నాగ్ కేవలం కుర్చీకే పరిమితమయ్యే కేరక్టర్ చేస్తూ.. సంచలనం సృష్టిస్తున్నాడు.

భలేభలే మగాడివోయ్ బ్లాక్ బస్టర్ తర్వాత.. వెంకీ - నయనతారలతో బాబు బంగారం చిత్రం చేస్తున్నాడు దర్శకుడు మారుతీ. వీటికి తోడు త్రివిక్రమ్ తొలిసారిగా మీడియం హీరో నితిన్ తో చేస్తున్న అ..ఆ.. సంచలనాలకు కేంద్రం అవుతుందని అందరూ భావిస్తున్నారు. మలయాళ ప్రేమమ్ ను అదే పేరుతో రీమేక్ చేస్తున్నాడు చైతు.

ఇక సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి అంటూ ఈ ఏడాదే రానున్నాడు. లింగ ఫ్లాప్ తర్వాత.. ఓ డాన్ కేరక్టర్ లో రజినీ కనిపించనున్నారు. 24 అంటూ ఓ విభిన్నమైన సినిమాతో, మూడేసి పాత్రలను పోషిస్తూ సూర్య కొత్త ప్రయోగానికి కూడా తెర తీశాడు. ఈ సినిమాలన్నిటిపైనా అంచనాలు ఆకాశంలోనే ఉన్నాయి.