Begin typing your search above and press return to search.

ఇప్పుడు ఈ పిల్లకు ఉన్నంత డిమాండ్ ఎవరికీ లేదు..!

By:  Tupaki Desk   |   17 April 2022 3:30 AM GMT
ఇప్పుడు ఈ పిల్లకు ఉన్నంత డిమాండ్ ఎవరికీ లేదు..!
X
టాలీవుడ్ లో రోజుకో బ్యూటీ హీరోయిన్ గా పరిచయమైనా.. అందం అభినయంతో పాటుగా ఆవగింజంత అదృష్టం కలిసొచ్చినవారు మాత్రమే ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. ఇప్పుడు కన్నడ కుర్ర భామ శ్రీ లీల కూడా ఈ కోవకే చెందుతుంది.

కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన 'పెళ్ళిసంద' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. ఫలితం ఎలా ఉన్నా ఈ సినిమా అమ్మడికి బాగానే ఉపయోగపడింది. సాంగ్స్ లో గ్లామర్ షోతో అదరగొట్టి యువ హృదయాలను కొల్లగొట్టింది.

తొలి సినిమాతోనే దర్శక నిర్మాతల దృష్టిలో పడిన శ్రీ లీల కు ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ అందుతున్నాయి. ఇప్పుడు తెలుగులో మిడ్ రేంజ్ హీరోలు మరియు డెబ్యూ హీరోలకు ఈ బ్యూటీ ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈమెను ఉన్నంత డిమాండ్ మరే ఇతర హీరోయిన్ కు లేదని చెప్పవచ్చు.

రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ధమాకా' చిత్రంలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. అలానే 'అనగనగా ఒక రాజు' అనే సినిమాలో యువ హీరో నవీన్ పోలిశెట్టి సరసన సందడి చేస్తోంది.

వారాహి బ్యానర్ లో గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు హీరోగా లాంచ్ అవుతున్న సినిమాలో శ్రీ లీలనే హీరోయిన్ గా తీసుకున్నారు. నితిన్ - వక్కంతం వంశీ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న మూవీలో ఈ బ్యూటీ నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెండో సినిమా 'సెల్ఫిష్' లో శ్రీ లీల హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించనున్న ఓ మూవీ కోసం పెళ్లి సందడి భామని పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదే క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించనుందని రూమర్స్ వస్తున్నాయి.

మహేష్ - త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28 చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించనుంది. అయితే ఇందులో సెకండ్ హీరోయిన్ గా శ్రీ‌ లీల ను తీసుకునే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. మహేష్ తో జోడి కట్టబోతోందనే వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ.. ప్రస్తుతం శ్రీ లీల చేతిలో అర డజనుకు పైగా ఆఫర్స్ ఉన్నాయని తెలుస్తోంది.

టాలీవుడ్ లో 2022 శ్రీలీల నామ సంవత్సరం కానుంది. వీటిల్లో కొన్ని సినిమాలు సక్సెస్ అయినా అమ్మడి క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు వెళ్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.