Begin typing your search above and press return to search.
2015లో నెక్ట్స్ బ్లాక్ బస్టర్ ఏది?
By: Tupaki Desk | 16 Nov 2015 1:00 PM ISTటాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ 3 నెలలు దాటిపోయింది. జూలైలో వచ్చిన జక్కన్న బాహుబలి - ఆగస్ట్ లో రిలీజ్ అయిన సూపర్ స్టార్ శ్రీమంతుడు.. బ్లాక్ బస్టర్స్ అయి ఇండస్ట్రీ లో టాప్ 1 - 2 ప్లేసుల్లో నిలిచాయి. కానీ ఆ తర్వాత రిలీజ్ అయిన మూవీస్ లో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న మూవీ భలేభలే మగాడివోయ్ ఒక్కటే. ఇది మీడియం బడ్జెట్ మూవీ కావడంతో... ఎంత పెద్ద హిట్ అయినా ఇండస్ట్రీ రికార్డుల్లోకి వచ్చే ఛాన్స్ లేదు.
ఆ సత్తా ఉన్నాయని భావించిన మూవీస్ డిజాస్టర్స్ గా మిగిలాయి. శ్రీను వైట్ల-రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందిన బ్రూస్ లీ.. ప్రేక్షకులు కాదు కదా.. కనీసం ఫ్యాన్స్ ని కూడా మెప్పించలేకపోయింది. అక్కినేని అభిమానునలు ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిల్ అరంగేట్ర చిత్రానిదీ సేమ్ సీన్. రిలీజ్ రోజునే డివైడ్ టాక్ స్ప్రెడ్ అవడంతో.. కలెక్షన్స్ ఫుల్లుగా డ్రాప్ అయిపోయాయి. ఇక పుంజుకోవడం కష్టమే అని తేల్చేస్తున్నాయి రిపోర్టులు. ఇక 2105 కంప్లీట్ అయేందుకు మరో నెలన్నర గడువు మాత్రమే ఉంది. వీటిలో బ్లాక్ బస్టర్స్ అయేందుకు ఛాన్సులున్న సినిమాలు తక్కువే. అందులో ఒకటి మాస్ మహరాజా బెంగాల్ టైగర్. ఈ మూవీకి బజ్ బాగానే ఉన్నా.. ప్రమోషన్ లో వెనుకబడ్డం, రిలీజ్ డేట్ నే ఫిక్స్ చేసుకోలేకపోవడం మైనస్ పాయింట్స్.
పూరీ తీసిన లోఫర్ కూడా డిసెంబర్ లోనే వచ్చే ఛాన్సుంది. ఫర్ సప్పోజు వచ్చిందంటే.. మెగా వారసుడు వరుణ్ తేజ్ నటించిన మొదటి మాస్ మూవీ కావడంతో... హైప్ ఎక్కువగానే ఉంది. ఈ రెండింటిలో ఏదైనా బ్లాక్ బస్టర్ సాధిస్తే తప్ప... ఇండస్ట్రీ రికార్డులు సాధించడం మిగిలిన వాటికి కష్టమే. శంకరాభరణం - సైజ్ జీరోలు సూపర్ హిట్ అయినా సరే.. ఆ రేంజ్ చేరుకోలేవన్నది సుస్పష్టమే. అందుకే ఈ రెండు మూవీస్ రిజల్ట్ పై ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.