Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కి కోడలి మెగా స్వాగతం..

By:  Tupaki Desk   |   25 March 2020 6:00 PM IST
మెగాస్టార్ కి కోడలి మెగా స్వాగతం..
X
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంటరయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన అకౌంట్ క్రియేట్ చేసారు. మెగాస్టార్ ఇంతకాలం తన అభిమానులకు ఆడియో లాంచ్ లలో, సినిమా వేడుకల్లో తప్ప ఎక్కడ కూడా కనిపించేవారు కాదు. ఈరోజు చిరంజీవి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయగానే లక్షల్లో అభిమానులు ఆయనను ఫాలో అవ్వడం మనం గమనించవచ్చు. ఇక ఆయన కోడలు ఉపాసన 'వెల్కమ్ టు ట్విట్టర్ మామయ్య' అనే ట్వీట్ తో స్వాగతం పలికింది.

దీనిపై మెగాస్టార్ స్పందిస్తూ... ఇకనుండి నా అభిమానులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎప్పటికప్పుడు నా అభిప్రాయాలను, ఆలోచనలను ట్విట్టర్ వేదికగా మీతో పంచుకుంటానని తెలిపారు. ఇంతవరకు సోషల్ మీడియాలో కనిపించని మెగాస్టార్ నిన్న ట్విట్టర్ లోకి రానున్నట్లు ప్రకటించేసరికి అభిమానులు, సినీ ప్రముఖులు అలెర్ట్ గా ఉండి ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇక ఈ సందర్బంగా అభిమానులకు ఉగాది పండుగ శుభకాంక్షలు తెలిపారు. కోడలు ఉపాసన కూడా మామయ్యకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంది.