Begin typing your search above and press return to search.

పిల్లలతో ఉపాసన రంగస్థలం

By:  Tupaki Desk   |   2 April 2018 1:01 PM GMT
పిల్లలతో ఉపాసన రంగస్థలం
X
ఒకరి గురించి చెప్పాలన్నా.. పొగడాలన్నా.. ఆ వ్యక్తి భార్యకు మించి ఎవరు చేయగలరు చెప్పండి? ఇప్పుడు రామ్ చరణ్ మూవీ రంగస్థలంలో.. చిట్టిబాబు పాత్రను చెర్రీ మెప్పించిన తీరుకు ఊరూవాడా అందరూ పొగిడేస్తున్నారు. ప్రశంసల జల్లు కురిపించేస్తున్నారు. ఇంతటి ఘనవిజయం తన భర్త సాధించడం కచ్చితంగా ఉపాసనకు గర్వకారణమే.

అయితే.. ఆమె ఇటు భార్యగాను.. అటు సోషల్ యాక్టివిస్ట్ గాను కలిపి రియాక్ట్ అయింది. రంగస్థలంను బ్లాక్ బస్టర్ చేసినందుకు ఇప్పటికే థ్యాంక్స్ చెప్పేసిన ఉపాసన.. ఇప్పుడు తనదైన స్టైల్ లో బోలెడంత మంది చిన్నపిల్లలకు ఈ సినిమా చూపించింది. అయితే.. వీరంతా చిట్టిబాబు పాత్ర మాదిరిగా వైకల్యం ఉన్నవారే. ఇక్కడ వైకల్యం ఒకటే పాయింట్ కాదు.. ఇవాళ వరల్డ్ ఆటిజం డే. ఈ సందర్భంగా ఆటిజం అనే సమస్యతో ఇబ్బందులు పడుతున్న పలువురు చిన్నారులకు రంగస్థలం మూవీ చూపించి.. వారితో కలిసి తానూ మరోసారి చూసి ఎంజాయ్ చేసింది మెగా పవర్ స్టార్ వైఫ్.

'హైద్రాబాద్ లోని పలువురు అద్భుతమైన చిన్నారుల కోసం రంగస్థలం. టీం రంగస్థలంకు కృతజ్ఞతలు. మీరు ఈ రోజున చాలామందిని సంతోషంలో ముంచెత్తారు' అంటూ అభినందనలు చెప్పింది ఉపాసన. మరోవైపు.. రిలీజ్ అయిన 4వ రోజు నాటికే రంగస్థలం మూవీ 100 కోట్ల రూపాయల గ్రాస్ ను దాటేసి రికార్డుల వేటను కంటిన్యూ చేస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి