Begin typing your search above and press return to search.
సమంతకు `ఉత్తమ కోడలు` అవార్డ్ ఇచ్చిన మెగాకోడలు
By: Tupaki Desk | 28 Sept 2020 3:40 PM ISTమెగా కోడలు ఉపాసన- అక్కినేని కోడలు సమంత చెలిమి గురించి తెలిసిందే. ఇటీవలే యుఆర్ లైఫ్ డాట్ కాంని ప్రారంభించి ఇందులో లైఫ్ స్టైల్ కి సంబంధించిన ఎన్నో విషయాల్ని వెల్లడిస్తున్నారు. సామాన్య జనాలకు కూడా అర్థమయ్యే రీతిలో ఎంతో అందమైన కార్యక్రమాల్ని డిజైన్ చేసి లైవ్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ కార్యక్రమాలకు స్పందన బావుంది.
తాజాగా సమంత తో కలిసి ఉపాసన ఓ వంట కార్యక్రమానికి హోస్టింగ్ చేయగా ఆ వీడియోకి అద్భుతమైన వ్యూస్ దక్కాయి. బ్రౌన్ రైస్ తో `సక్కాలి కదం` అనే వంటకం తయారు చేయడమెలా? అన్నదానిపై సమంత వీడియో క్లాస్ తీసుకోగా.. దానికి ఉపాసన క్శశ్చన్స్ రక్తి కట్టించాయి.
అయితే వంటకం మాటేమో కానీ కోడళ్ల మధ్య స్నేహం మాత్రం అందరికీ నచ్చింది. వంట బావుంది.. నాగచైతన్య అదృష్టవంతుడు! అంటూ ఉపాసన కాంప్లిమెంట్ ఇవ్వడమే గాక `ఉత్తమ కోడలు` అవార్డు(కితాబు) ను కూడా సామ్ కి ఇచ్చారు. ఇక ఫిట్ నెస్ సహా పలు ఆరోగ్యకర విన్యాసాలపై మునుముందు రంజింపజేసే వీడియోలు కథనాలు ఈ వెబ్ కోసం వండి వార్చనున్నారు కోడళ్లు. ప్రస్తుతం మెగా అక్కినేని కోడళ్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. అన్నట్టు ఇంత పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చిన కోడళ్లు ఇలా చేస్తుంటే.. ఇతర వంటల చానెళ్లు .. ఫిట్ నెస్ చానెళ్లు మూతపడడం ఖాయంగానే కనిపిస్తోంది.
