Begin typing your search above and press return to search.

ఉపాసన ప్లానింగ్‌ మామూలుగా లేదు

By:  Tupaki Desk   |   28 March 2016 10:16 AM IST
ఉపాసన ప్లానింగ్‌ మామూలుగా లేదు
X
స్టార్ హీరోల కుటుంబాల్లో గతంలో చాలామంది బయటకు కూడా వచ్చేవారు కాదు. ముఖ్యంగా వారి భార్యలు బయట కనిపించేది కూడా తక్కువగానే ఉంటుంది. అవతలి వ్యక్తి కూడా సినీరంగానికి సంబంధించి ఉంటే మినహా.. మిగతావారి గురించి చాలా మంది చాలా తక్కువ తెలుసు. చిరంజీవి - వెంకటేష్ - బాలకృష్ణలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

కానీ కొత్త తరం బాగా మారుతోంది. వారి ప్రొఫెషనలిజంను తమ భర్తల కెరీర్ లోనూ ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు భార్య నమ్రత సూపర్ స్టార్ కి సంబంధించిన సినిమా సంగతులను దగ్గరుండి చూసుకుంటోందనే టాక్ ఉన్నా.. ఆమె మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తోంది. అయితే.. రామ్ చరణ్ భార్య ఉపాసన తీరు వేరు. ఈమె ముందు నుంచి ఇండస్ట్రియలిస్ట్ కావడంతో.. అన్నీ ప్రొఫెషనల్ గా మెయింటెయిన్ చేయడం అలవాటు. ఇప్పుడదే తీరు తన భర్త చెర్రీ కి సంబంధించిన ప్లానింగ్ లోనూ అప్లై చేస్తోందని తెలుస్తోంది.

స్టార్లకు మీడియా మెయింటెనెన్స్ కు సంబంధించి పీఆర్ ఓ చాలా కీలకం. రామ్ చరణ్ పీఆర్ ఓని మార్చడంలో ఉపాసన ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. అంతే కాదు.. కెరీర్ - షెడ్యూల్ ప్లానింగ్ లోనూ వీలయినంతగా సహకరిస్తోందట. కేవలం ఈమె ప్రొఫెషనలిజం చరణ్ విషయంలోనే కాదు.. మొత్తం మెగా ఫ్యామిలీకి సహాయ సహకారాలు అందిస్తోందని అంటున్నారు. అంతెందుకు.. మెగా60 అంటూ చిరు 60వ పుట్టిన రోజును అంత గ్రాండ్ గా, అంత సక్సెస్ ఫుల్ గా డీల్ చేయడంలో ఉపాసన పాత్రే కీలకం. ఇప్పుడు చిరు చిన్న కూతురు శ్రీజ పెళ్లిని బెంగళూరులో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడంలోనూ ఉపాసన పర్ఫెక్ట్ ప్లానింగ్ కారణంగా తెలుస్తోంది.