Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ వైఫ్.. ప్రతిజ్ఞ చేసేసింది

By:  Tupaki Desk   |   30 Sept 2016 10:10 AM IST
రామ్ చరణ్ వైఫ్.. ప్రతిజ్ఞ చేసేసింది
X
సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే ఏటేటా జరుపుకూనే ఉంటారు జనాలు. ఆరోగ్యం మీద.. ముఖ్యంగా గుండె కోసం ఏమేం చేయాలో తెల్లారేపాటికి మర్చిపోతూ ఉండడం కూడా కామన్. ఈసారి వరల్డ్ హార్ట్ డేని మర్చిపోకుండా ఉండేందుకు.. సెంటిమెంట్ తో కూడిన ప్రతిజ్ఞ చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన. అంతే కాదు.. మనల్ని కూడా చేసేయమంటోంది.

'హేయ్ గైస్.. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నేను మా నాన్న ఆరోగ్యం గురించి ప్రతిజ్ఞ తీసుకుంటున్నా. అయన ఎప్పుడూ బ్రేక్ ఫాస్ట్ మిస్ కాకుండా చూస్తాను. 15 నిమిషాలు ఎక్సర్ సైజ్.. 10వేల అడుగుల నడక ఉండేలా చర్యలు తీసుకుంటా. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి కచ్చితంగా హెల్త్ చెకప్స్ చేయించాల్సిందే. సారి చెప్పడం కంటే.. ముందు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం. ఈ వరల్డ్ హార్ట్ డే రోజున మీ డాడ్ కోసం మీరేం చేయబోతున్నారు? లైఫ్ స్టైల్ లో చిన్నపాటి మార్పులతో జీవితంలో సుదీర్ఘ కాలం ఉపయోగపడే పెద్ద మార్పులను సాధించచ్చు. మనకందరికీ అవేంటో తెలుసు. వాటిని పాటించాలంతే' అంటూ సీరియస్ గా ప్లెడ్జ్ తీసుకోవడమే కాదు.. చిన్నపాటి క్లాస్ ని కూడా మిక్స్ చేసింది ఉపాసన.

మరి తమ అభిమాన హీరో మెగా పవర్ స్టార్ భార్య చెప్పిన మాటలను.. ఎంతమంది మెగాభిమానులు ఫాలో అయిపోతారో చూడాలి.