Begin typing your search above and press return to search.

చరణ్‌ వీడియోతో ఉపాసన మెసేజ్

By:  Tupaki Desk   |   5 Sept 2017 10:17 PM IST
చరణ్‌ వీడియోతో ఉపాసన మెసేజ్
X
చాలారోజుల నుండి ఫిట్నెస్ గురించి ఉపాసన కామినేని వీడియోలతో కోచింగ్ ఇస్తున్న సంగతి తెలసిందే. స్వతహాగా అపోలో హెల్త్ కు డైరక్టర్ అయిన ఉపాసన.. తను ఒక ఉదాహరణగా ఉండాలని తలచి.. ముందు తన వెయిట్ తగ్గించుకుని.. బాగా సన్నబడి.. వెంటనే తను ఎలా మార్పు చెందిందో ప్రపంచానికి చూపిస్తూ.. అప్పుడు అందరినీ తగ్గండంటూ సలహాలూ సూచనలూ ఇవ్వడం మొదలెట్టింది మెగా కోడలు.

ఇక లివ్-బై-ఎగ్జాంపుల్ అంటున్న ఉపాసన అదే విషయాన్ని తన సొంత ఫ్యామిలీలో కూడా ప్రయోగిస్తోందట. ఆల్రెడీ చరణ్ చాలా వెయిట్ తగ్గి కొత్త లుక్ లో కనిపించడానికి అందుకు ఉపాసనే కారణం అంటున్నారు. ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్న ఒక వీడియోను పోస్టింగ్ చేసి.. ఒక పెద్ద విషయాన్నే చెప్పింది ఉపాసన. ఒకప్పుడు రోజంతా సిగరెట్టు గట్రా తాగితే ఆరోగ్యానికి ఎంత నష్టం జరిగేదో ఇప్పుడు రోజంతా కూర్చుని పనిచేయడం వలన అంతే నష్టం జరుగుతోందట. అందుకే చరణ్‌ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎలాగైతే నడుస్తూ ఉంటాడో చూపిస్తూ.. ''మిస్టర్ సి కూడా ఆరోగ్యవంతమైన జీవితం కోసం పాఠాలు చెబుతున్నారు. నీరసంగా కూర్చుంటే మంచిది కాదు. కదులుతూ ఉండండి. #sittingisthenewsmoking #teachersday'' అంటూ మెసేజ్ ఇచ్చింది ఉపాసన.

మొత్తానికి ఫిట్నెస్ గురించి త్వరలోనే యావత్ మెగా ఫ్యాన్స్ కు.. ఆ తరువాత మొత్తంగా టాలీవుడ్ ను ఎడ్యుకేట్ చేసేలా ఉంది ఉపాసన!!