Begin typing your search above and press return to search.

60 వ‌య‌సులో చెర్రీ అత్త‌గారి సాహ‌సం తెలిస్తే షాక్ తింటారు

By:  Tupaki Desk   |   31 Dec 2020 1:16 PM IST
60 వ‌య‌సులో చెర్రీ అత్త‌గారి సాహ‌సం తెలిస్తే షాక్ తింటారు
X
మెగాస్టార్ వియ్యంకురాలు రామ్ చ‌ర‌ణ్ అత్త‌గారి సాహ‌సం గురించి తెలిస్తే ఎవ‌రైనా షాక్ తినాల్సిందే. చెర్రీ అత్త‌గారు.. ఉపసన తల్లి గారు స‌వాళ్ల‌కే ప్ర‌తిస‌వాల్ గా మారి సైకిల్ సాహ‌స యాత్ర ను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌డం సంచ‌ల‌నంగానే మారింది. ఈ వ‌య‌సులో ఆమె సాహ‌సం ఎంద‌రికో స్ఫూర్తిగానూ నిలుస్తోంది. మ‌రికాస్త వివ‌రాల్లోకి వెళితే..

ఉపసనా కొణిదెల‌ ఆరోగ్యానికి సూచ‌న‌లు స‌ల‌హాలు ఇస్తూ నిరంత‌రం చురుకైన ఫిట్‌నెస్ ఫ్రీక్ గా అభిమానుల‌కు సుప‌రిచితం. ఉపాస‌న అపోలో బిజినెస్ ని జాగ్రత్తగా చూసుకుంటూనే.. సామాజిక త‌త్ప‌ర‌త‌తో మంచి ఆరోగ్యానికి అవగాహన కలిగించడంలో కొత్త ఆలోచనలను అన్వేషించి ప్ర‌జ‌ల‌కు చేర‌వేస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన ఈ కార్యకలాపాలతో ఉపసనా ఎప్పుడూ తనను తాను చురుకుగా సానుకూలంగా మ‌లుచుకోవ‌డంపై చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

ఉపాసనకు ఆ ల‌క్ష‌ణాలు ఎవ‌రి నుంచి అబ్బాయి? అంటే.. తన తల్లి నుండి వార‌స‌త్వంగా పొందిన‌వేన‌ని తాజా ప‌రిణామం చెబుతోంది. 60 ఏళ్ళ వయసులో ఉపసనా తల్లి గారు శోభ‌నా కామినేని హైదరాబాద్ నుండి చెన్నైకి సైకిల్ టూర్ చేయాలని నిర్ణయించుకుని దానిని దిగ్విజ‌యంగా పూర్తి చేయ‌బోతున్నార‌ట‌. ఉపాసనా ఈ సైకిల్ రైడ్ వీడియోని తన ఇన్ ‌స్టాగ్రామ్ లో షేర్ చేసి వివరాలను అందించారు.

ఈ వ‌య‌సులో భారతదేశాన్ని అన్వేషించడం త‌న ల‌క్ష్య‌మ‌ట‌. ఆమె ఫ్రంట్‌లైన్ అపోలో ఫార్మసీ కుటుంబాన్ని శక్తివంతం చేస్తూ.. జట్టు నిర్మాణ వ్యాయామంతో సాహ‌సం చేస్తున్నారు. ఈ విహార యాత్ర‌తో కుటుంబ బంధం బ‌ల‌ప‌డ‌డ‌మే గాక వార‌సులు దీనిని అనుసరించడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంద‌ని.. బావిస్తున్నార‌ట‌.

నేను మీ గురించి చాలా గర్వపడుతున్నాను. ఈ యాత్ర చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా నాన్న గారికి అంటూ చెప్పుకొచ్చారు ఉపాస‌న‌. ఈ సాహ‌స యాత్ర‌లో త‌న ఫ్యామిలీ స‌భ్యులంద‌రి పేర్ల‌ను ఇక్క‌డ ప్ర‌స్థావించారు.