Begin typing your search above and press return to search.

మోడీకి ఉపాసన ట్వీట్.. నెటిజన్ల విమర్శలు!

By:  Tupaki Desk   |   4 March 2020 3:15 PM IST
మోడీకి ఉపాసన ట్వీట్.. నెటిజన్ల విమర్శలు!
X
రామ్ చరణ్ వైఫ్ ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఈమధ్య ప్రధాని నరేంద్ర మోడీ తన సమాజిక మాధ్యమ ఖాతాలను మహిళలకు ఒక రోజు ఇస్తానని మన సమాజంలో మార్పు తీసుకొచ్చే దిశగా ప్రయత్నించే మహిళలు ఈ అవకాశం అందిపుచ్చుకోవాలని కోరారు. దీనికి స్పందనగా ఉపాసన తనకు ఓ అవకాశం ఇవ్వాలని ప్రధానిని కోరారు. భారత దేశాన్ని ఆరోగ్యకరమైన దేశంగా మార్చడానికి.. అందుబాటు లో వైద్యసేవలు అందించేందుకు సూచనలు అందించాలని ఉందంటూ రిప్లై ఇచ్చారు.

సహజంగా ఇలాంటి మెసేజిలకు నెటిజన్ల నుండి స్పందన పాజిటివ్ గానే ఉంటుంది. కొందరు ఉపాసన ఆలోచనలను మద్దతు తెలిపారు. కానీ ఈ ట్వీట్ కు కొందరు నెటిజన్లు షాకింగ్ కౌంటర్లు ఇచ్చారు. ముందు అపోలో సంగతి చూడాలని కౌంటర్లు ఇచ్చారు.. అపోలో హాస్పిటల్ లో భారీ ఫీజులు తగ్గించి ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్యసేవలు అందించాలని.. అక్రమంగా వసూలు చేసే పార్కింగ్ ఫీజులపై దృష్టి సారించాలని కోరారు. కొందరేమో ఉపసాన తమ అపోలో హాస్పిటల్ కు ప్రమోషన్ చేసుకుంటోందని.. అంతకు మించి మరొకటి లేదని విమర్శించారు. కొందరు నెటిజన్లు అపోలో హెల్త్ ప్రోడక్టులలో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయని.. వాటి సంగతి ముందు చూడాలని కోరారు.

మెగా ఫ్యాన్స్ తమ వదినమ్మను వెనకేసుకు వచ్చారు కానీ ఈ నెటిజన్లు మాత్రం తమ పదునైన విమర్శలతో ఉపాసనకు షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఈ విమర్శలకు ఉపాసన స్పందించ లేదు కానీ త్వరలో వీటికి బదులిస్తుందేమో వేచి చూడాలి.